ఎన్టీఆర్ ట్రైలర్ లో ఎంత మంది స్టార్స్ ఉన్నారో గమనించారా?

బాలకృష్ణ-క్రిష్ కలయికలో వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ సినిమా ‘ఎన్టీఆర్’ నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరెకెక్కిస్తున్న ఈ మూవీని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకి తెస్తున్నారు. ఇందులో మొదటి భాగం అయిన కథానాయకుడు సినిమాకు సంబంధించి ట్రైలర్ రిలీజ్ చేశారు. రామారావ్ పర్సనల్ లైఫ్ నుంచి సినిమాల్లోకి రావడం, అటు నుంచి రాజకీయాల వైపు వెళ్లడం వరకూ కట్ చేసిన ఈ ట్రైలర్ లో ఎన్నో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. అవేంటో ఎన్టీఆర్ కథానాయకుడు ట్రైలర్ బ్రేక్ డౌన్ లో చూద్దాం, ప్రకాష్ రాజ్ వాయిస్ తో మొదలైన ఈ ట్రైలర్ లో రామారావు చక్కగా సరిపోతాడండీ అంటూ ఆ వెంటనే డైరెక్టర్ క్రిష్ వాయిస్ వినిపిస్తుంది. ఆ తర్వాత 0.40సెకన్స్ దగ్గర తెలుగు సినిమా పితామహుడు హెచ్ ఎమ్ రెడ్డి పాత్రలో నటుడు కైకాల సత్యనారాయణ కనిపిస్తారు. 0.43సెకన్స్ దగ్గర డైరెక్టర్ క్రిష్, ప్రకాష్ రాజ్ లు అటు వైపు తిరిగి కుర్చీలో కూర్చొని ఉంటారు గమనించండి. ఆ తర్వాత రామారావ్ నటించిన సినిమాల లుక్స్ లో కనిపించిన బాలయ్య తండ్రిని గుర్తు చేస్తూ మెప్పిస్తాడు.

ఇక 1.10సెకన్స్ దగ్గర యమగోల సినిమాలో ఓలమ్మీ తిక్కరేగిందా పాట సీన్ లో హుషారుగా చిందేస్తున్న బాలయ్య కనిపిస్తారు ఆయన పక్కనే జయప్రద గెటప్ లో హన్సిక కనిపిస్తుంది. 1.12సెకన్స్ దగ్గర గుండమ్మ కథ సినిమాలోని సావిత్రి పాత్రలో నటిస్తున్న నిత్యా మీనన్ ని చూడవచ్చు. 1.15సెకన్స్ దగ్గర వచ్చే ఫ్రేమ్ లో ఎన్టీఆర్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది హిట్ సాంగ్ అయిన వేటగాడు సినిమాలోని ఆకుచాటు పిందె తడిసె సాంగ్ లో శ్రీదేవి కేరక్టర్ లో రకుల్ ప్రీత్ సింగ్, అన్నగారిగా బాలయ్య బాబు కనిపిస్తారు చూడండి.

ఇక్కడి వరకు ఎన్టీఆర్ సినీ జీవితాన్ని చూపించిన ట్రైలర్ లో 1:42 సెకండ్స్ నుంచి పొలిటికల్ జర్నీ చూపిస్తూ ట్రైలర్ కి కొత్త ఊపు తెచ్చారు. ఈ పొలిటికల్ జర్నీలో 1:42సెకన్స్ దగ్గర పొలిటికల్ ఎంట్రీ కోసం చైతన్య రధాన్ని రెడీ చేస్తున్న సన్నివేశం ఉంటుంది ఆ తర్వాత మొత్తం ట్రైలర్ కే హైలైట్ అయ్యే షాట్స్ రెండు ఉన్నాయి అందులో ఒకటి 2:04సెకన్స్ దగ్గర బాలయ్యను సీఎంగా అసెంబ్లీలో చూపిస్తారు, ఈ షాట్ కి కాస్త క్లియర్ గా గమనిస్తే ఠీవిగా నడుచుకుంటూ వచ్చే అన్నగారి ముందు నిలబడిన చంద్రబాబు గెటప్ లోని దగ్గుబాటి రానా కనిపిస్తాడు. ఈ షాట్ లోనే కాకుండా ట్రైలర్ లోని 2:22 సెకండ్స్ దగ్గర అసెంబ్లీ బ్యాక్ డ్రాప్ లో తెలుగు తమ్ముళ్ళ మధ్యలో కార్ దిగి వస్తున్న బాలకృష్ణ కనిపిస్తారు, లో యాంగిల్ లో అచ్చం అన్నగారిలాగే కనిపించిన బాలకృష్ణ ముందు రానా మరోసారి నిలబడి ఉంటాడు చూడండి. ఒకవేళ రానాని గమనించడం మిస్ అయితే మరోసారి ట్రైలర్ ఓపెన్ చేసి చూడండి ఎంతో మంది స్టార్స్ మీ కంటికి కనిపిస్తారు. మొత్తానికి ట్రైలర్ తోనే ఫుల్ సినిమా చూపించిన క్రిష్, బాలయ్య సంక్రాంతికి ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తారో చూడాలి