NTR: ఎన్టీఆర్ కెరియర్లో 30వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఎన్టీఆర్.. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయాలని ప్లాన్ చేయగా.. చివరాకరికి కొన్ని అనివార్య కారణాల వల్ల కొరటాల శివతో ఫిక్స్ అవ్వడం జరిగింది. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన చిన్నపాటి ఫోటో కూడా విడుదల చేశారు. గతంలో కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ భారీ హిట్ అవడంతో .. పాటు కొరటాల సరికొత్త మాస్ యాక్షన్ ఫార్ములాతో సినిమాలు చేస్తూ పరాజయం లేని డైరెక్టర్ గా గ్రాఫ్ ఉండటంతో.. ఈ సినిమాపై నందమూరి అభిమానులు అంచనాలు ఓ రేంజిలో పెట్టుకున్నారు.
పైగా రాజమౌళి దర్శకత్వం హై వోల్టేజ్ “RRR” సినిమా తర్వాత సరైన డైరెక్టర్ కొరటాల అని..ఖచ్చితంగా ఎన్టీఆర్ కి హిట్ పడుతుందని అభిమానుల బలంగా విశ్వసిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి హీరోయిన్ల విషయంలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో మొదటి లో కొన్ని పేర్లు రాగా తాజాగా అనిరుద్ ఫిక్సైనట్లు లేటెస్ట్ ఇండస్ట్రీ బ్రేకింగ్ టాక్. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటె ఈ సినిమాని అతి తక్కువ టైమ్ లో ఎన్టీఆర్- కొరటాల కంప్లీట్ చేయాలని పక్కా ప్రణాళికలతో ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
ప్రస్తుతం కొరటాల “ఆచార్య” సినిమా కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఎన్టీఆర్ రాజమౌళి సినిమా షూటింగ్ కి సంబంధించి బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ చేస్తున్నారు. రెండు సినిమాలు కొలిక్కి వచ్చాక ఒకేసారి కొరటాల ఎన్టీఆర్ ఏక షెడ్యూల్ తో సినిమా కంప్లీట్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నారట.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!