NTR 30: ఎన్టీఆర్ తన కెరియర్ లో 30వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. “RRR” అంతర్జాతీయ స్థాయిలో సూపర్ డూపర్ హిట్ కావడంతో ఈ సినిమా విషయంలో ఎన్టీఆర్ మరియు కొరటాల చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. “RRR” తో ఎన్టీఆర్ కీ ప్రపంచ వ్యాప్తంగా ఓ ఇమేజ్ క్రియేట్ అవ్వడంతో స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. దాదాపు సంవత్సరం కి పైగానే ఈ సినిమా స్క్రిప్ట్ పై కూర్చున్న కొరటాల కొద్ది నెలల క్రితం ఫైనల్ చేశారు. అయితే ఫిబ్రవరి 24వ తారీఖు ఈ సినిమా ప్రారంభించాలని మొదటి డిసైడ్ అయ్యారు.
కానీ నందమూరి తారకరత్న మరణించడంతో వివిధ కార్యక్రమాలు ఉండటంతో… ఈ సినిమా ప్రారంభ తేదీ కార్యక్రమం వాయిదా పడింది. అయితే తాజాగా ఏప్రిల్ నెలలో “NTR 30” సినిమా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి సినిమా యూనిట్ రెడీ కావడం జరిగిందట. గతంలో కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో వస్తున్న ఈ ప్రాజెక్టుపై ఎన్టీఆర్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఎన్టీఆర్ కెరియర్ లో ఇది 30వ సినిమా కావటంతో నిర్మాత కళ్యాణ్ రామ్ చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టు తీసుకోవడం జరిగింది.
అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా దివంగత శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ అనీ టాక్ నడుస్తోంది. రాజమౌళితో సినిమా చేసిన తరువాత తన కెరీర్ లో చాలావరకు అట్టర్ ప్లాప్ లు ఎన్టీఆర్ ఎదుర్కొన్నాడు. దీంతో అటువంటి సెంటిమెంట్ రిపీట్ కాకూడదని కొరటాల తో చేయబోయే ప్రాజెక్టు విషయంలో తారక్ అన్ని విషయాలు చాలా జాగ్రత్తగా పరిశీలించాకే సినిమా ప్రాజెక్ట్.. మొదలు పెడుతున్నారట. పైగా తన కెరియర్ లో ఇది 30వ సినిమా కావటంతో రిజల్ట్ ఏ మాత్రం మిస్ ఫైర్ కాకూడదని అన్ని జాగ్రత్తలు తీసుకున్నారట.