6 కొట్టడం కూడా కష్టమే

తెలుగు సినీమా హిస్టరీనే తిరగరాసే సినిమా అవుతుందనుకున్న ఎన్టీఆర్ బయోపిక్ సినిమా ప్రేక్షకులని తీవ్ర నిరాశ పరిచింది. కథానాయకుడు పోయినా మహానాయకుడు కాపాడుతుంది అనుకుంటే రెండవ భాగం ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. బాలయ్య దశాబ్దం పాటు ఫ్లాప్స్ లో ఉన్న సమయంలో కూడా రానంత తక్కువ ఓపెనింగ్స్ రాబట్టిన మహానాయకుడు సినిమా మొదటి వీకెండ్ లో ప్రపంచవ్యాప్తంగా 3.40 కోట్ల కలెక్షన్స్ సాధించింది. దాదాపు 50కోట్ల టార్గెట్ తో రిలీజైన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ రీచ్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు.

కారణాలేవైనా కానీ మహానాయకుడు కలెక్షన్స్ పరిస్థితి ఫస్ట్ వీకెండ్ కే ఇలా ఉంటే లాంగ్ రన్ లో మరింత దిగజారిపోయే ప్రమాదం ఉంది. మహానాయకుడు సినిమాలాగే ఫ్లాప్ అయిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ డిజాస్టర్ అయినప్పటికీ కనీసం రూ. 20 కోట్లు కలెక్ట్ చేసింది కానీ సినిమా మహానాయకుడు సినిమా ఫుల్ రన్ లో కనీసం 6 కోట్ల మార్క్ ను అయినా టచ్ చేస్తుందా అనేది సందేహమే.100 సినిమాలు చేసిన బాలయ్య కెరీర్లో ఇది మరో దారుణమైన డిజాస్టర్ గా నిలిచేలా ఉంది.

ప్రపంచవ్యాప్తంగా ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

నైజామ్: 0.63 cr
సీడెడ్: 0.29 cr
ఉత్తరాంధ్ర: 0.27 cr
కృష్ణ: 0.30 cr
గుంటూరు: 0.61 cr
ఈస్ట్ : 0.18 cr
వెస్ట్: 0.16 cr
నెల్లూరు: 0.11 cr
ఎపీ + తెలంగాణా టోటల్: రూ. 2.55 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా: 0.24 cr
ఓవర్సీస్: 0.61 cr
వరల్డ్ వైడ్ టోటల్: రూ. 3.40 cr