సినిమా

NTR-Shankar: ఎన్టీఆర్‌తో శంక‌ర్ సినిమా.. చ‌ర‌ణ్ రియాక్ష‌న్ ఏంటంటే?

Share

NTR-Shankar: ఇండియ‌న్ స్టార్ డైరెక్ట్స్‌లో ఒక‌రైన శంక‌ర్ ప్ర‌స్తుతం మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. `ఆర్ఆర్ఆర్` త‌ర్వాత చ‌రణ్ చేస్తున్న పాన్ ఇండియా చిత్ర‌మిది. `ఆర్సీ 15` వ‌ర్కింగ్ టైటిల్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అంజ‌లి, సునీల్‌, జ‌య‌రామ్‌, నవీన్ చంద్ర త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు.

శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేన్స్‌ బ్యాన‌ర్‌పై ప్ర‌ముఖ బ‌డా నిర్మాత దిల్ రాజు భారీ బ‌డ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. గ‌త ఏడాది సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రం ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుంది. ఇంకా కొన్ని షెడ్యూల్ మాత్ర‌మే మిగిలి ఉన్నాయి. ఇదిలా ఉంటే.. `ఆర్సీ 15` అనంత‌రం శంక‌ర్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో ఓ మూవీ చేయాల‌ని భావిస్తున్నార‌ట‌.

అంతేకాదు, `ఆర్సీ 15` షూటింగ్ స‌మ‌యంలోనే శంక‌ర్ ఎన్టీఆర్ కోసం ఓ లైన్ రెడీ చేసి.. మొద‌ట చ‌ర‌ణ్‌కు వినిపించార‌ట‌. అది విన్నాక చ‌ర‌ణ్ రియాక్ట్ అవుతూ.. ఎన్టీఆర్ ఇమేజ్‌కు ప‌ర్ఫెక్ట్‌గా సూట్ అవుంద‌ని చెప్పార‌ట. ఇక‌ ఆలస్యం చేయకుండా ఎన్టీఆర్ కి సైతం శంక‌ర్ లైన్ వినిపించ‌గా.. ఆయ‌న‌కు కూడా బాగా న‌చ్చింద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి కొద్ది రోజుల్లోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్ర‌క‌ట‌న రానున్న‌ట్లు కూడా టాక్ న‌డుస్తోంది.

అస‌లింత‌కీ ఈ ప్ర‌చారం ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే మ‌రి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. కాగా, `ఆర్ఆర్ఆర్‌` అనంత‌రం ఎన్టీఆర్ కొర‌టాల శివ‌తో త‌న త‌దుప‌రి చిత్రాన్ని చేయ‌బోతున్న‌ట్లు అనౌన్స్ చేశాడు. `ఎన్టీఆర్ 30` వ‌ర్కింగ్ టైటిల్‌తో త్వ‌ర‌లోనే ఈ మూవీ ప‌ట్టాలెక్క‌నుంది.


Share

Related posts

భారతదేశ గొప్పదనాన్ని ఒక్క పాటలో చూపించారు

Siva Prasad

ఇద్ద‌రు కాదు.. ఒక‌రే!

Siva Prasad

Divyansha kaushik : దివ్యాన్ష కౌశిక్ తెలుగు సినిమాలకోసం ఎదురు చూపులు

GRK