NTR: “RRR” విజయంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగుతోంది. కొమరం భీమ్ పాత్రలో తారక్ నటనకు తెలుగు వాళ్ళు మాత్రమే కాదు అనేక భాషలకు చెందిన సినిమా ప్రేమికులు ఫిదా అయిపోయారు. ప్రస్తుతం తారక్ లైనప్ చూస్తే ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేయడం గ్యారెంటీ అన్న టాక్ ఇండస్ట్రీలో నడుస్తోంది. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం తారక్ సినిమా చేస్తుండగా ఆ తర్వాత కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇదిలా ఉంటే ఇప్పుడు కెరియర్లో 5 జాతీయ అవార్డు అందుకున్న తమిళ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో కూడా సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో నడుస్తోంది. వెట్రిమారన్ ఇటీవలె తారక్ కి ఓ స్టోరీ వినిపించినట్లు అంతా బాగున్నట్లు… సమాచారం. అయితే కొద్ది పాటి మార్పులు తారక్ సూచించినట్లు.. అంతా కుదిరితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న సినిమా కోసం ఎన్టీఆర్ బరువు తగ్గే పనిలో ఉన్నారట.
మరి కొద్ది రోజుల్లో ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. కెరియర్ లో 30వ సినిమా కావటంతో పాటు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేసిన తర్వాత చేస్తున్న సినిమా కావడంతో.. ప్రతి విషయంలో తారక్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ ప్రాజెక్టులో వచ్చే ఏడాదిలో తారక్ పాల్గొననున్నారు. ఈ రెండు అయిన తర్వాత ఒకవేళ స్టోరీ ఓకే అయితే వెట్రిమారన్ ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభం కానుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.