NTR: యంగ్ టైగర్ NTR పరిచయం అక్కర్లేదు. సుమారు 4 సంవత్సరాల తర్వాత తారక్ నుండి వచ్చిన RRR సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అయ్యి, నందమూరి అభిమానులకు మంచి కనువిందు చేసింది. ఇక NTR తన తదుపరి సినిమాను దర్శకుడు కొరటాలతో ఎప్పుడని అనుకున్నారో అప్పటినుండి అతని అభిమానులు వేయి కళ్ళతో వారి కాంబినేషన్ కొరకు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కొరటాల దర్శకత్వంలో జనతా గ్యారేజ్ అనే సినిమాను తెరకెక్కించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. తదుపరి సినిమాగా ఎలాంటి సినిమాను చేస్తాడా అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
విభిన్నమైన బ్యాక్ డ్రాప్ లో వస్తుదంట!
అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న వీరి కాంబినేషన్ ఎట్టకేలకు జూన్ నెలలో పట్టాలెక్కబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది. దాంతో తారక్ అభిమానులు ఖుషి అవుతున్నారు. ఇకపోతే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ చిత్రం ఈ వారంలో విడుదలకు సిద్దం అవుతుంది. ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా దర్శకుడు కొరటాల శివ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హీరోగా NTR ఇప్పటి వరకు కనిపించని విభిన్నమైన పాత్రలో ఆయన్ను చూపించబోతున్నట్లుగా ఓ హింట్ ఇచ్చి పారేసారు.

- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కొరటాల శివ చెప్పిన మాటలు ఇవే:
తాజాగా మరో మీడియా వేదికగా మాట్లాడిన కొరటాల NTR 30 సినిమా కథకు సంబంధించిన నేపథ్యం గురించి ఇంటరెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటి వరకు ఇండియన్ సినీ స్క్రీన్ పై చూడని ఒక విభిన్నమైన బ్యాక్ డ్రాప్ నేపథ్యంను వారి కాంబినేషన్లో చూ పించబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ప్రతి ఒక్కరికి కూడా నచ్చే విధంగా మెచ్చే విధంగా సినిమా కథ ఉంటుంది. అని చెప్పుకొచ్చారు. ఇక వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా కూడా చాలా విభిన్నంగా ఉంది. అందులో ఎన్టీఆర్ పాత్రకు చాలా మంచి పేరు వచ్చింది.