NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అప్పట్లో వచ్చిన “ఊసరవెల్లి” సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించిన సంగతి తెలిసిందే. తమన్నా హీరోయిన్ గా చేసిన ఈ సినిమాలో ఎన్టీఆర్ అమ్మాయి కన్నా అదే విధంగా రకరకాల షేడ్స్ కలిగిన పాత్రలో చేస్తూ టైటిల్ కి సరైన జస్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఈ సినిమాకి ఇచ్చిన పాటలు అప్పట్లో ఓ ఊపు ఊపాయి. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి భారీ హిట్ అందుకుంది.
సరికొత్త మేక్ఓవర్ టాటూ తో ఎన్టీఆర్… సినిమాల్లో కనిపించడం అప్పటికే వరుస విజయాల మీద ఉండటంతో ఊసరవెల్లి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సునామీని సృష్టించే కలెక్షన్లు రాబట్టింది. ముఖ్యంగా సురేందర్ రెడ్డి డైరెక్షన్ అదరగొట్టేసింది. ఇదిలా ఉంటే ఈ సినిమా స్క్రిప్టు మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ వద్దకు వెళ్ళకముందే ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని వద్దకు వెళ్లిందట.
“అతడే ఆమె సైన్యం” అనే టైటిల్ తో… సూరి రామ్ కి ఈ కథ వినిపించినప్పుడు… రామ్ రిజెక్ట్ చేసినట్లు తర్వాత ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళినట్లు అతను హిట్ కొట్టినట్లు సరికొత్త వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్త తెలుసుకుని నార్మల్ నెటిజన్లు.. రామ్ ఒక బ్లాక్ బస్టర్ హిట్ స్టోరీ మిస్ చేసుకున్నాడు… ఎన్టీఆర్ క్యాష్ చేసుకున్నాడు అంటూ తాజా వార్త పై కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ RRR సినిమా చేస్తున్నాడు. రామ్ మరో కొత్త సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. సురేందర్ రెడ్డి అఖిల్ తో ఏజెంట్ అనే సినిమా చేస్తున్నాడు.