NTR Neel: యంగ్ టైగర్ ఎన్టీఆర్ RRR తో గ్లోబల్ మార్కెట్ సంపాదించుకోవడం తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో RRR తెలుగు చలనచిత్ర రంగం యొక్క పేరుని మాత్రమే కాదు భారతీయ చలన చిత్ర రంగం యొక్క దమ్మును కూడా నిరూపించింది. ఈ సినిమా ఆస్కార్ అవార్డు సొంతం చేసుకుంది. ఇండియాలో ఇప్పటివరకు ఏ సినిమాకి రాని అంతర్జాతీయ అవార్డులు RRR కి వచ్చాయి. దీంతో ఎస్ఎస్ రాజమౌళి ఆస్కా అవార్డు రాకముందు అమెరికాలో RRR కి ఆస్కార్ కి వచ్చే విధంగా ప్రమోషన్ చేస్తున్న సమయంలో కచ్చితంగా సీక్వెల్ చేస్తున్నట్లు ప్రకటించేశారు. ఇటీవల రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ సైతం మహేష్ బాబుతో రాజమౌళి చేస్తున్న సినిమా తర్వాత RRR సీక్వెల్ ఉంటుందని తెలియజేయడం జరిగింది.
ఇదిలా ఉంటే వచ్చే ఏడాది సమ్మర్ లో మహేష్ బాబు సినిమాని జక్కన్న స్టార్ట్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ఏడాదిలో కంప్లీట్ అయ్యేవిధంగా రాజమౌళి పక్క ప్లానింగ్ తో ఉన్నారట. ఈ సినిమాలో నటించిన ఇంకా హాలీవుడ్ టెక్నీషియన్స్ ని కూడా రంగంలోకి దింపబోతున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా జరుగుతూ ఉండగానే మరోపక్క RRR సీక్వెల్ విషయంలో ఎన్టీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారంట. మేటర్ లోకి వెళ్తే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ దేవర అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతోంది. ఈ క్రమంలో సెకండ్ భాగం సినిమా స్టార్ట్ చేస్తూనే మరోపక్క కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమా కూడా స్టార్ట్ చేయాలని ఎన్టీఆర్ డిసైడ్ అయ్యారట.
సరిగ్గా RRR సీక్వెల్ స్టార్ట్ అయ్యే సమయానికి ఫ్రీగా ఉండాలని… ఈ లోపు ఒప్పుకున్న ప్రాజెక్టులన్ని కంప్లీట్ చేయాలని ఎన్టీఆర్ స్ట్రాంగ్ గా డిసైడ్ అయినట్లు..టాక్. అంతేకాదు RRR సీక్వెల్ కి ఎన్టీఆర్ మరింత దృఢంగా కనిపించబోతున్నట్లు ఇందుకోసం వర్కౌట్లు కూడా సినిమా షూటింగ్ ముందుగానే చేయనున్నట్లు అందువల్ల ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు త్వరగా కంప్లీట్ చేసే ఆలోచనలో ఎన్టీఆర్ ఉన్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ ప్రాజెక్టును నిర్మించే నిర్మాణ సంస్థ.. మైత్రి మూవీ మేకర్స్ వచ్చే ఏడాది ఏప్రిల్ నుండి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్లు రీసెంట్ గా అధికారిక ప్రకటన చేయడం జరిగింది. ఈ ప్రకటనతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.