సినిమా ధియేటర్ లకు ఆడియన్స్ రావటం లేదు వ్యాఖ్యలపై ఎన్టీఆర్ రియాక్షన్..!!

Share

‘బింబిసార’ ప్రీ రిలీజ్ వేడుక నిన్న హైదరాబాద్ శిల్పకళా వేదికలో అభిమానుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్..’బింబిసార’ సినిమా యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. తన అన్న నందమూరి కళ్యాణ్ రామ్ తప్ప ఇంకెవరు ‘బింబిసార’ కి న్యాయం చేయలేరని స్పష్టం చేశారు. ‘బింబిసార’ నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లో చాలా ప్రతిష్టాత్మకమైన సినిమా అని స్పష్టం చేశారు. ఈ సినిమా చూశాక ప్రతి అభిమాని నందమూరి కళ్యాణ్ రామ్ కెరియర్ గురించి ‘బింబిసార’ ముందు తర్వాత అని గ్యారెంటీగా చెప్పుకుంటారని పేర్కొన్నారు.

ఇక డైరెక్టర్ వేణు వశిష్ట నీ పొగడ్తలతో ముంచెత్తారు. ‘బింబిసార’ ట్రైలర్ వేణు వశిష్ట ఫిలిం కెరీర్ కి తొలి ట్రైలర్ అని మంచి భవిష్యత్తును ఆదర్శకుడని.. పొగడ్తలతో ముంచెత్తారు. ‘బింబిసార’ సినిమా ఇటీవల చూడటం జరిగింది అద్భుతంగా ఉందని కచ్చితంగా అందరికీ నచ్చుతుందని స్పష్టం చేశారు. ఇక ఇదే సమయంలో తెలుగు సినిమా ప్రేక్షకులు థియేటర్లకు రావడంలేదని కొంతమంది అంటున్నారు. కచ్చితంగా సినిమాలో దమ్ముంటే.. అద్భుతమైన సినిమా అయితే.. ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు.

తెలుగు ఇండస్ట్రీకి గడ్డు కాలమని.. ఆడియన్స్ థియేటర్ లకు రావడం లేదని కొందరు అంటున్నారు. అలాంటి వ్యాఖ్యలను నేను ఎప్పటికీ నమ్మను. అద్భుతమైన సినిమా వస్తే థియేటర్ లోనే చూసి… ఇండస్ట్రీని గొప్ప మనసుతో తెలుగు ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని ఎన్టీఆర్ స్పష్టం చేశారు. దీంతో ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. ‘బింబిసార’ ఆగష్టు 5వ తారీఖు విడుదల అవ్వుతోంది. హీరోగా మాత్రమే కాదు నిర్మాతగా కూడా కళ్యాణ్ రామ్ ఈ సినిమాకి వ్యహరించారు.


Share

Recent Posts

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

28 నిమిషాలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

37 నిమిషాలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

1 గంట ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

1 గంట ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

2 గంటలు ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

2 గంటలు ago