NTR: నందమూరి ఫ్యామిలీలో చిన్న వయసులోనే సినీ ఎంట్రీ ఇచ్చిన హీరో జూనియర్ ఎన్టీఆర్(NTR). బాల రామాయణం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. ఆ తరువాత 18 సంవత్సరాలకు నిన్ను చూడాలని అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. రెండో సినిమా స్టూడెంట్ నెంబర్ వన్(Student Number 1) తోనే విజయం సాధించి ఆ తర్వాత ఆది ఓ సూపర్ డూపర్ హిట్ కొట్టి తరువాత సింహాద్రి(Simhadri) సినిమా తో ఇండస్ట్రీ హిట్ అందుకొని.. టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో ఇపుడు తిరుగులేని స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఎన్టీఆర్ తన కొడుకు భార్గవ్ రామ్(Bharghav Ram) నీ చిన్న వయసులోనే సినీ ఎంట్రీ చేయించడానికి ఏర్పాటు చేసుకున్నట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది.
అంత మాత్రమే కాక భార్గవ్ రామ్ కి మేకప్ వేస్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దీంతో ఎన్టీఆర్ కొడుకు ఎక్కడ ఎవరితో సినిమా అనేదానిపై సస్పెన్స్ నెలకొనివుంది రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి. దీంతో చిన్న వయసులోనే భార్గవ్ రామ్ సినిమా ఎంట్రీ… వార్త నందమూరి అభిమానులను ఎంతగానో సంతోషపెడుతుంది. మరోపక్క అల్లు అర్జున్ కూతురు ఆర్హ కూడా సినిమా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.
సమంత(Samantha) ప్రధాన పాత్రలో గుణశేఖర్(Guna Sekhar) దర్శకత్వంలో శాకుంతలం సినిమాలో..చేస్తోంది. ఈ క్రమంలో మంచి ఫామ్ లో ఉన్న ఈ స్టార్ హీరోలు.. అతి చిన్న వయసులోనే.. తమ పిల్లలను సినిమా రంగం ఎంట్రీ ఇప్పించడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఎన్టీఆర్ RRR.. ప్రమోషన్ లో ఉన్నారు తర్వాత కొరటాల శివ సినిమా స్టార్ట్ చేయనున్నారు. ఈ క్రమంలో భార్గవ్ రామ్ కి సంబంధించి సినీ ఎంట్రీ ఎన్టీఆర్ భార్య దగ్గరుండి చూసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.