RRR: “ఆర్ఆర్ఆర్” మార్చి 25 వ తారీకు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కడం తో… దేశవిదేశాలలో భారీ క్రేజ్ ఏర్పడింది. ముఖ్యంగా బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత… జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో “ఆర్ఆర్ఆర్” పై భారీ అంచనాలు నెలకొన్నాయి. టాటా సినిమా విడుదలకు ఇంకా కొద్ది రోజులు ఉండటంతో ప్రమోషన్ కార్యక్రమాల విషయంలో సినిమా యూనిట్ స్పీడ్ పెంచింది. వరుస పెట్టి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. తాజాగా హీరోలు చరణ్, తారక్ లను మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి ఇంటర్వ్యూ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఇద్దరు హీరోలు సినిమా విశేషాలు మరియు షూటింగ్ జరిగిన విధానం ఇంకా అనేక విషయాల గురించి ఇంటర్వ్యూలో చర్చించుకున్నారు. కాగా కీరవాణి కంపోజ్ చేసిన పాటలలో భీమవరం బుల్లోడ పాలు కావాలా… మే సంవత్సరాలు తనకు నచ్చదని ఎన్టీఆర్ తెలిపారు. ఇష్టమైన సింగర్ ఎవరన్న ప్రశ్నకు మోహన భోగరాజు, గీతా మాధురి అని స్పష్టం చేశారు. ఇదే సమయంలో యాంకర్ సుమకి మీ సినిమాలో ఏ రోల్ ఇస్తారని… ప్రశ్నించగా దానికి ఎన్టీఆర్ స్పందిస్తూ…సుమకి నాయనమ్మ లేదా అమ్మమ్మ అలాంటి పాత్ర ఇస్తానని తెలిపారు.
సుమాకి బాగా చాదస్తం ఎక్కువ అని… నోరు పారేసుకుని పడుతుందని…. ఆమెను చూడగానే గయ్యాళి అత్త పాత్ర గుర్తొస్తుంది అని తారక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చరణ్ నువ్వు అయితే ఏ పాత్ర ఇస్తావు అని ప్రశ్నించగా… ఆమెకు పంచాయతీలు పరిష్కరించే మధ్యవర్తి క్యారెక్టర్ ఇస్తానని చెప్పుకురవడం జరిగింది. ఏది ఏమైనా “ఆర్ఆర్ఆర్” మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో .. ఇంటర్వ్యూ లతో బిజీ అవుతున్న తారక్, చరణ్.. సినిమా విషయాలతోపాటు వ్యక్తిగత విషయాలకి సంబంధించి కొత్త విషయాలను తెలియజేస్తూ ఉన్నారు.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!