25.7 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Taraka Ratna: పెళ్లి చేసుకున్నాక క్లిష్ట సమయంలో తారకరత్నకీ అతిపెద్ద హెల్ప్ చేసిన ఎన్టీఆర్..?

Share

Taraka Ratna: సినీ నటుడు నందమూరి తారకరత్న మృతి రాజకీయంగా సినిమా పరంగా సంచలనం సృష్టించింది. 39 సంవత్సరాల వయసులో గుండెపోటుకు గురై 23 రోజులు హాస్పిటల్ లో చావుతో పోరాడి మృతి చెందాటం అందరికీ షాక్ కీ గురి చేసింది. 20 సంవత్సరాల వయసులోనే సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన తారకరత్న.. పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. ఈ క్రమంలో తారకరత్న మృతి నేపథ్యంలో ఆయన గురించి బయటకు వస్తున్న వార్తలు.. సంచలనంగా మారాయి. ముఖ్యంగా తారకరత్న జీవితంలో ఆయన పెళ్లి అతిపెద్ద టర్నింగ్ పాయింట్. కారణం ఆల్రెడీ పెళ్లయిన అలేఖ్య రెడ్డిని ఆయన చేసుకోవడం. అలేఖ్య రెడ్డి అంతకుముందు తెలంగాణలో రాజకీయ నేపథ్యం కలిగిన ఓ ప్రముఖ రాజకీయ నేత కొడుకుని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత మనస్పర్ధలు వచ్చి విడాకులు తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఫ్యాషన్ డిజైనర్ గా సినీ ఫీల్డ్ తో టచ్ ఉన్న అలేఖ్య రెడ్డి… తారకరత్నతో ప్రేమలో పడి వివాహం చేసుకున్నారు.

NTR was the biggest help to Tarakaratna in the difficult time after marriage

ఆల్రెడీ పెళ్లి అయ్యి విడాకులు తీసుకున్న అమ్మాయిని చేసుకోవడంతో తారకరత్నకీ  కుటుంబం నుండి వ్యతిరేకత రావడం జరిగింది అంట. దీంతో ఆ సమయంలో ఆర్థికంగా ఇంకా అన్ని రకాలుగా తారకరత్న కష్టాలు పడ్డారట. ఒకానొక సమయంలో పిల్లలకు కనీస అవసరతలు కూడా తీర్చలేని పరిస్థితి ఎదుర్కొంటున్న క్రమంలో ఈ విషయం ఎన్టీఆర్ దాకా వెళ్ళటంతో ఎవరికి తెలియకుండా తారకరత్నకి కొన్ని లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందంట. ఈ విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ఎన్టీఆర్ తమ్ముడు ఆర్థికంగా తనని ఆదుకున్నట్లు అప్పట్లో చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

NTR was the biggest help to Tarakaratna in the difficult time after marriage

కాగా 2016వ సంవత్సరంలో తారకరత్న బర్తడే సమయంలో మళ్లీ కుటుంబ సభ్యులు కలిశారు. అప్పటినుండి మళ్ళీ కొద్ది కొద్దిగా సినిమా అవకాశాలు అందుకుంటూ రాజకీయంగా ఎదుగుతున్న క్రమంలో.. ఒక్కసారిగా గుండెపోటుకు గురై మరణించడం అందరిని కలిచివేసింది. తారకరత్న బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఎన్టీఆర్ స్వయంగా వెళ్లి పర్యవేక్షించారు. అన్న ఆరోగ్యంగా తిరిగి రావాలని భగవంతునికి అందరు ప్రార్థించాలని కోరారు. ఈ క్రమంలో ఆయన మరణించడంతో ఎన్టీఆర్ కూడా తల్లడిల్లిపోయారు. ఇదిలా ఉంటే సోమవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం తెలుగు ఫిలిం ఛాంబర్ నందు ఆయన భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు.


Share

Related posts

RRR: ప్రీమియర్స్‌లోనే కొత్త చరిత్ర..ఇది రాజమౌళి క్రేజ్

GRK

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

bharani jella

బాలీవుడ్‌లో `భాగ‌మ‌తి`?

Siva Prasad