నందమూరి బాలకృష్ణ ఈరోజు 60 వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, చిరంజీవి, నందమూరి కళ్యాణ్ రాం తో పాటు పలువురు సినీ ప్రముఖులు, రాజకీయనాయకులు బాలయ్యకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే అన్నిటికంటే ఆసక్తికరంగా మారింది యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బాలయ్యకి బర్త్ డే విషెస్ చెప్పడం. బాబాయ్ అంటే ఎన్.టి.ఆర్ కి ఎంతటి ప్రేమ అభిమానాలు ఉన్నాయో ఈ సందర్భంగా అందరికీ తెలుస్తోంది.
“నా లోని అభిమానిని తట్టి లేపింది మీరే..నాకు ఊహ తెలిశాక చూసిన మొట్టమొదటి హీరో మీరే..ఈ 60వ పుట్టినరోజు మీ జీవితంలో మరపురానిది కావాలని, మీరు ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను. ఐ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్ డే బాబాయ్ . జై బాలయ్య !” అని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
ఇక బాలయ్య ఈ రోజు కుటుంబ సభ్యులతో కలిసి షష్ఠి పూర్తి కార్యక్రమం జరుపుకోనుండగా ఆ వేడుకలో ఎన్టీఆర్ సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలవబోతున్నాడని సమాచారం. అంతేకాదు టాలీవుడ్ కి చెందిన పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. చెప్పాలంటే ఒకే వేదిక మీద బాబాయ్ అబ్బాయి కలిసి చాలా కాలం అయింది. దాంతో ఈరోజు బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా ఇద్దరు ఒకే వేదిక మీద కలవబోతున్నారని అది నందమూరి అభిమానులకి కన్నుల పండగా ఉండబోతుందని అందరూ ఆతృతగా మాట్లాడుకుంటున్నారు.
నాలోని అభిమానిని తట్టి లేపింది మీరే..నాకు ఊహ తెలిశాక చుసిన మొట్టమొదటి హీరో మీరే..ఈ 60వ పుట్టినరోజు మీ జీవితంలో మరపురానిది కావాలని, మీరు ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను. I wish you a very Happy 60th Birthday Babai. జై బాలయ్య ! #HappyBirthdayNBK pic.twitter.com/C2zDH9iO44
— Jr NTR (@tarak9999) June 10, 2020
60లో అడుగుపెడుతున్న మా బాలకృష్ణకి షష్టి పూర్తి శుభాకాంక్షలు.ఇదే ఉత్సాహంతో ,ఉత్తేజంతో
ఆయురారోగ్యాలతో నిండునూరేళ్ల సంబరం కూడా జరుపుకోవాలని,అందరి అభిమానం ఇలాగే పొందాలని కోరుకుంటున్నాను.Dear #NBK as U turn the magical 60,I fondly reminisce on Ur amazing journey.Happy birthday— Chiranjeevi Konidela (@KChiruTweets) June 10, 2020
మీరు ఎందరికో బాలయ్య..నాకు మాత్రం తండ్రి తరువాత తండ్రి స్థానంలో ఉండే బాబాయ్. మీ ఆదర్శంతోనే సినిమాల్లోకి వచ్చాను,మీ స్ఫూర్తి తో నే కొనసాగుతున్నాను. ఈ 60వ పుట్టిన రోజున మీరు సంతోషం గా ఆరోగ్యం గా ఉండాలని కోరుకుంటున్నాను.Wishing you a very Happy 60th Birthday Babai #HappyBirthdayNBK pic.twitter.com/ZhRClCvXRJ
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) June 10, 2020