RRR: ఇండియన్ ఫిలిం లవర్స్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులు “RRR” కోసం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. “బాహుబలి”తో ప్రపంచ సినిమా ప్రేమికుల దృష్టి తనవైపు మలుచుకున్న రాజమౌళి…”RRR” కూడా అదే రేంజ్ లో హిట్ అవ్వాలని.. ప్రతి సన్నివేశం విషయంలో చాలా కేర్ తీసుకోవడం జరిగింది. ఇదే క్రమంలో సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన వీడియోలు టీజర్.. నెక్స్ట్ లెవెల్ లో ఉన్న సంగతి తెలిసిందే. టీజర్ వీడియోలు సాంగ్స్ కి ఈ సినిమాపై అంచనాలు… డబల్ త్రిబుల్ అయ్యాయి. ఇటువంటి తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలు భారీ ఎత్తున నార్త్ మొదలుకొని సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ వరకు అదరగొట్టేసారు. డైరెక్టర్ రాజమౌళి తో పాటు హీరోలు.. చరణ్, ఎన్టీఆర్ అనేక ఇంటర్వ్యూలలో పాల్గొనడం జరిగింది.
బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు సల్మాన్ చీఫ్ గెస్ట్ గా రాగా.. తమిళంలో అదేరీతిలో మలయాళంలో అక్కడి స్టార్ హీరోలు… “RRR” ప్రీ రిలీజ్ వేడుకలో చాలా సంతోషంగా పాల్గొని… సినిమాకి మంచి హైప్ తీసుకు వచ్చారు. ఈ క్రమంలో సరిగ్గా విడుదల అయ్యే తరుణంలో ఒమిక్రన్ కేసులు పెరుగుతూ ఉండటం తో.. చాలా రాష్ట్రాలు సినిమా థియేటర్ లపై ఆంక్షలు విధించడంతో ఈ సినిమా విడుదల వాయిదా పడటం తెలిసిందే. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలకు భారీ ఎత్తున నిర్మాతలు ఖర్చు కట్టగా ఇప్పుడు.. సినిమా వాయిదా పడటం పెద్ద మైనస్ గా మారింది. అయితే ఇంతలా బయట వాతావరణం ఉన్నా గాని ఈ సినిమాకి సంబంధించి సరికొత్త విషయాలు రాజమౌళి రోజుకొక రీతిలో బయటకు వచ్చే విధంగా.. కొత్త కొత్త విషయాలు తెలియజేస్తున్నారు.
మేటర్ లోకి వెళ్తే ఎన్టీఆర్ ఒక సన్నివేశం కోసం ఏకంగా తన బాడీ షేప్ మార్చుకోవడానికి ఐదారు నెలలు జిమ్ లో కష్టపడి నట్లు.. కొత్త విషయాన్ని తెలియజేశారు. అడవిలో.. ఎన్టీఆర్ పరిగెత్తే సీన్ కోసం.. బాడీ …షేప్ పూర్తి గా మార్చడం కోసం …జిమ్ లో రకరకాల వర్కవుట్లు చేయడం జరిగిందట. ఈ సీన్ లో.. పులి నోరు దగ్గర గట్టిగా నిద్రించే ఎన్టీఆర్ పరిగెత్తే టైంలో.. కనీసం తన పాదాలకు దట్టమైన పొలాలలో అడవులలో చెప్పులు లేకుండా.. పరిగెత్తి సన్నివేశం పర్ఫెక్ట్ గా వచ్చేటట్టు… తారక్ కష్టపడ్డారు అని.. రాజమౌళి ఈ విషయాన్ని తాజాగా బయటపెట్టాడు. థియేటర్లో ఈ సన్నివేశం హైలెట్ గా నిలుస్తుందని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నది.. ఇప్పుడు ఎవరికీ అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది. మరోపక్క దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి.