NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు శనివారం రెండు తెలుగు రాష్ట్రాలలో అంగారంగ వైభవంగా అభిమానులు నిర్వహించారు. “RRR” తో అంతర్జాతీయ స్థాయిలో విజయం అందుకోవటంతో పాటు ఆస్కార్ దాకా తారక్ ప్రయాణం సాగటంతో… ఎన్టీఆర్ 40 జన్మదిన వేడుకలు చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఇక ఇదే సమయంలో ఒకరోజు ముందుగానే కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాకి సంబంధించి టైటిల్ దేవరా అని ప్రకటించి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేసి అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో మే 20వ తారీకు నాడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ విపరీతమైన సందడి చేయడం జరిగింది.
దీంతో ఆదివారం నాడు తారక్ అభిమానులకు ఎమోషనల్ లెటర్ రాశారు. “ఇన్నేళ్ల మొత్తం కెరియర్ లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. కానీ నా అభిమానులు మాత్రం నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు నేను చేసిన ప్రతి పాత్ర, చేసిన ప్రతి సినిమా నా అభిమానుల కోసమే చేశా. నన్ను నా సినిమాలను ఇంతవరకు ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. నాపై చూపిస్తున్న ప్రేమ అభిమానాలను ఎప్పటికీ మర్చిపోలేను. దేవర’ ఫస్ట్ లుక్‌కు వచ్చిన అద్భుతమైన స్పందనకు కృతజ్ఞతలు తెలియజేశారు.
‘‘పుట్టినరోజును ఇంత ప్రత్యేకంగా మార్చినందుకు నా స్నేహితులకు, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు, నటీనటులకు అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నా’’ అని లేఖలో పేర్కొన్నారు. ఎన్టీఆర్ పెట్టిన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం చేస్తున్న “దేవర” షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తారీఖు ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమాలో దివంగత అందాల తార శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నెగిటివ్ పాత్ర చేస్తున్నారు. సీనియర్ నటుడు శ్రీకాంత్ కూడా కీలక పాత్రలో కనిపిస్తున్నారు.