Entertainment News సినిమా

Brahmastra: బ్రహ్మాస్త్ర ఈవెంట్ లో ఎన్టీఆర్ కీలక వ్యాఖ్యలు..!!

Share

Brahmastra: బాలీవుడ్ మూవీ “బ్రహ్మాస్త్ర” సినిమా మరి కొద్ది రోజుల్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ కపుల్స్ రణబీర్ కపూర్ మరియు ఆలియా భట్ కలిసిన నటించిన ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్ర పోషించడం జరిగింది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఫ్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ లో భారీ ఎత్తున ప్లాన్ చేయక ఆఖరి నిమిషంలో క్యాన్సిల్ అయింది. అయితే ఈ వేడుక కోసం రెండు తెలుగు రాష్ట్రాలలో ఇంకా చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి ఎన్టీఆర్ అభిమానులు ముందుగా రాగానే ఆఖరి క్షణంలో పోలీస్ శాఖ చేతులెత్తేయడంతో “బ్రహ్మాస్త్ర” ప్రీ రిలీజ్ వేడుక క్యాన్సిల్ అయ్యి హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్ లో మీడియా సమావేశం తరహాలో జరిగింది. ఈ కార్యక్రమానికి సినిమా యూనిట్ తో పాటు డైరెక్టర్ రాజమౌళి..కరణ్ జోహార్ వచ్చారు.

NTR's key comments in Brahmastra event..!!

NTR 31: ఆ సినిమా టార్గెట్ గా ఎన్టీఆర్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట ప్రశాంత్ నీల్..??

ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ ముందుగా తన అభిమానులకు క్షమాపణలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. వినాయక చవితి వేడుకల నేపథ్యంలో పోలీస్ సెక్యూరిటీ ఇవ్వలేమని డిపార్ట్మెంట్ ఆఖరి క్షణంలో తీసుకున్న నిర్ణయంతో.. జరగాల్సిన భారీ ఈవెంట్ ఆగిపోయినట్లు స్పష్టం చేశారు. ఇంక సినిమా గురించి అనేక విశేషాలు మాట్లాడుతూ ప్రస్తుతం సినిమా రంగం చాలా ఒత్తిడికి గురవుతుందని చెప్పుకొచ్చారు. ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులు కొత్తదనాన్ని ఆశిస్తున్నారని తారక్ చెప్పకోచ్చారు.

NTR's key comments in Brahmastra event..!!

ఎన్టీఆర్ అభిమానుల ఆశ‌ల‌న్నీ గ‌ల్లంతు.. అర‌రే ఇలా జ‌రిగిందేంటి?

ఇటువంటి ఒత్తిడిలో మంచి సినిమాలు అందించడంలో అందరం కృషి చేస్తామని..”బ్రహ్మాస్త్ర” మూవీ భారతదేశానికి బ్రహ్మస్త్రంలా మారాలని కోరుకుంటున్నట్లు సినిమా యూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ తెలియజేశారు. చిన్ననాటి టైంలో బాబాయ్ నాగార్జున ఓ హిందీ చిత్రం చేయడం జరిగింది. తెలుగు నుండి హిందీ లోకి వెళ్లి ఆ భాష మాట్లాడి చేసిన మొట్టమొదటి హీరోగా బాబాయ్ ని చూశాను. మళ్లీ చాలాకాలం తర్వాత బాబాయి నాగార్జున నీ “బ్రహ్మాస్త్ర” లో చూడటం చాలా ఆనందం కలిగిస్తుందని తనదైన శైలిలో ఎన్టీఆర్ స్పీచ్ ఇచ్చారు.


Share

Related posts

రవితేజ ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని ఎవరూ ఊహించలేదు.. ఇది గత చిత్రాల అనుభవమేనా ..?

GRK

Anil Ravipudi: నా ఫస్ట్ సినిమా చేస్తున్న సమయంలో ఆ స్టార్ హీరో ఏడిపించేవాడు.. అనిల్ రావిపూడి వైరల్ కామెంట్స్..!!

sekhar

Akhanda: అఖండ ఫైనల్ షూటింగ్ లో ఈ సీన్స్ చిత్రీకరణ..!!

bharani jella