రేపు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ ఎత్తున మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించటానికి రెడీ అవుతున్నారు. ఈరోజు హైదరాబాద్ హైటెక్స్ లో మెగా హీరోల ఆధ్వర్యంలో మెగా కార్నివాల్ జరగనుంది. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ మినహా మిగతా మెగా హీరోలంతా హాజరుకానున్నారు. ఇదిలా ఉంటే చిరంజీవి జన్మదినానికి ఒకరోజు ముందే ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్ డేట్ లు వస్తూ ఉండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.
విషయంలోకి వెళ్తే మేహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి “భోలా శంకర్” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ వేదాళం సినిమాకి రీమేక్ గా తేరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుండగా హీరోయిన్ పాత్రలో తమన్నా నటిస్తోంది. అన్నాచెల్లెళ్ల బంధం నేపథ్యంలో తెరాకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 14 వ తారీకు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. చిరంజీవి జన్మదినం సందర్భంగా ప్రత్యేకమైన పోస్టర్ విడుదల చేసి.. రిలీజ్ డేట్ ఖరారు చేయటం జరిగింది.
ఇదిలా ఉంటే ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు గాడ్ ఫాదర్ సినిమాకి సంబంధించి అప్ డేట్ రానున్నట్లు సినిమా యూనిట్ ప్రత్యేకమైన వీడియో విడుదల చేయడం జరిగింది. ఏది ఏమైనా చిరంజీవి జన్మదినానికి సంబంధించి ఒక రోజు ముందే ఆయన నటిస్తున్న సినిమాల అప్ డేట్ లు రావటం సినిమా ఇండస్ట్రీలో సంచలనం రేపింది. ఆచార్య ఆఫ్టర్ ఫ్లాప్ కావటంతో.. ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో చిరంజీవి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.