Pushpa 2: గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన “పుష్ప” ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రం పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఫస్ట్ టైం వీరిద్దరి కాంబినేషన్ లో పాన్ ఇండియా స్థాయిలో వచ్చిన “పుష్ప” బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏకంగా ₹100 కోట్లు సాధించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. గమ్మత్తైన విషయం ఏమిటంటే హిందీలో “పుష్ప” ప్రమోషన్ కార్యక్రమాలు సరిగ్గా జరగలేదు.
అయినా గాని “పుష్ప” విడుదలైన సమయంలో వచ్చిన హిందీ సినిమాలు అన్నిటికంటే ఎక్కువ కలెక్ట్ చేయడం జరిగింది. సినిమాలో తగ్గేదేలే డైలాగ్ మరియు శ్రీవల్లి సాంగ్ దేశాలకు ప్రాంతాలకు భిన్నంగా అందరిని ఆకట్టుకోవడం జరిగింది. పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు “పుష్ప” డైలాగులతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. దీంతో సెకండ్ పార్ట్ కోసం అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తూ ఉన్నారు. “పుష్ప” గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదల కాగా రెండో భాగం షూటింగ్ ఈ ఏడాది సమ్మర్ లో స్టార్ట్ చేయాలని సినిమా యూనిట్ ప్లాన్ చేసింది.
కానీ మొదటి భాగానికి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో సెకండ్ పార్ట్ స్క్రిప్ట్ మొత్తం మార్చి.. ఎక్కువ టైం తీసుకోవడం జరిగింది. స్క్రిప్ట్ వర్క్ పై సుకుమార్, అల్లు అర్జున్ కొన్ని నెలలపాటు కష్టపడ్డారు. అయితే తాజాగా అక్టోబర్ 17వ తారీఖు నాడు “పుష్ప 2” రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయినట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. సినిమాని ది బెస్ట్ గా అందించడానికి.. బన్నీ మరియు సుకుమార్ కష్టపడుతున్నట్లు సినిమా యూనిట్ ఫోటో షేర్ చేయడం జరిగింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ సంతోషంగా ఉన్నారు.