సినిమా

KGF NTR: “కేజిఎఫ్” డైరెక్టర్ ఫ్యామిలీకి పార్టీ ఇచ్చిన ఎన్టీఆర్ ఫుల్ ఎంజాయ్..!!

Share

KGF NTR: “కేజిఎఫ్” సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక సంచలనం. దేశంలో అతి చిన్న ఇండస్ట్రీ కన్నడలో తెరకెక్కిన “కేజిఎఫ్” దేశవ్యాప్తంగా అనేక రికార్డులు క్రియేట్ చేయడం అందరికీ మతిపోయేటట్టు చేసింది. ఆ తర్వాత ఇటీవల రిలీజ్ అయిన “కేజిఎఫ్ 2” కూడా అదే రేంజ్ లో బ్లాక్ బస్టర్ విజయం సాధించడం మాత్రమే కాదు ఏకంగా వెయ్యి కోట్లు కలెక్ట్ చేయడం జరిగింది. ఇటీవలే బాలీవుడ్ ఇండస్ట్రీ లో “దంగల్” రికార్డులు కూడా “కేజిఎఫ్ 2” బ్రేక్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమాతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగుతోంది. దీంతో ప్రశాంత్ నీల్ తో సినిమా చేయడానికి బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ వరకు టాప్ మోస్ట్ నిర్మాతలు ఎదురు చూసే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది.

on his mariage day ntr gave party to kgf director family

కాగా ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో “సలార్” చేస్తూనే మరోపక్క తారక్ ప్రాజెక్ట్ ప్రకటించడం జరిగింది. అంతమాత్రమే కాదు దాదాపు 15 సంవత్సరాల నుండి ఎన్టీఆర్ సినిమాలు చూడటం మాత్రమే కాదు ఆయన అభిమాని అయిపోయా అని కూడా ప్రశాంత్ నీల్ ఇటీవల “కేజిఎఫ్ 2” ప్రమోషన్ కార్యక్రమాల్లో చెప్పుకొచ్చారు. దీంతో “కేజిఎఫ్” వంటి హై ఓల్టేజ్ మాస్ ఎలిమెంట్స్ కంటెంట్ కలిగిన ప్రశాంత్ నీల్… మాస్ లో తిరుగులేని క్రేజ్ ఉన్న తారక్ నీ ఎలా చూపిస్తాడో అన్న ఉత్కంఠ అభిమానులలో స్టార్ట్ అయింది.

on his mariage day ntr gave party to kgf director family

ఇదంతా పక్కన పెడితే తాజాగా ఎన్టీఆర్… కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి పార్టీ ఇచ్చి ఫుల్ ఎంజాయ్ చేయడం జరిగింది. ఒక్క ప్రశాంత్ నీల్ కి మాత్రమే కాదు ఆయన భార్యతో పాటు తన భార్య ప్రణతి తో కలిసి నలుగురు.. మే 5వ తారీకు అనగా తన పెళ్లి రోజు.. “కేజిఎఫ్” డైరెక్టర్ ఫ్యామిలీతో కలిసి.. ఎన్టీఆర్ ఫ్యామిలీ పార్టీ ఘనంగా జరుపుకున్నారు. దింతో ఎన్టీఆర్ పెళ్లి రోజు పార్టీకి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నయి. ఈ క్రమంలో.. ఎన్టీఆర్ అభిమానులు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ… త్వరగా సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లండి అని కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్… కొరటాల శివ ప్రాజెక్టు చేస్తున్నారు. ఇది కంప్లీట్ అయినా వెంటనే ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయనున్నారని సమాచారం.


Share

Related posts

దేవదాస్ కనకాల కన్నుమూత

Siva Prasad

కార్తీకదీపం వంటలక్క కన్నా ఆమె భర్త వరల్డ్ వైడ్ ఫేమస్… కారణం పెద్దదే!!

Naina

చమ్మక్ చంద్ర పై నాగబాబు కామెంట్స్ వైరల్..! సమాజంలో ముసుగు ధరించి బ్రతుకుతున్నారు..!

arun kanna
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar