Hbd NBK: నటసింహం నందమూరి బాలయ్య బాబు బర్తడే జూన్ 10వ తారీకు. దీంతో బాలయ్య బాబు జన్మదిన వేడుకలు భారీ ఎత్తున జరపటానికి ఇప్పటికే ఫ్యాన్స్ భారీ ప్లాన్ వేస్తున్నారు. గత ఏడాది 60వ జన్మదినోత్సవం సందర్భంగా… బాలకృష్ణ కుటుంబ సభ్యులతో పాటు బసవతారకం హాస్పిటల్ లో ఉన్న క్యాన్సర్ బాధితులతో బర్తడే వేడుకలు జరుపుకున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు వచ్చే నెలలో రాబోయే బాలకృష్ణ బర్తడే కి అభిమానులకు డబుల్ ధమాకా అని ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
పూర్తి విషయంలోకి వెళితే ప్రస్తుతం బాలకృష్ణ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇదే సమయంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమా కూడా ఓకే చేయడం జరిగింది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ లో బిజీగా బాలయ్య ఉన్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి టైటిల్ ఇప్పటి వరకు పెట్టలేదు. “NBK 107” అనే టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. అనిల్ రావిపూడి సినిమాకి సంబంధించి స్టోరీ ఇంకా కన్ఫర్మ్ కాలేదు.
కానీ కమర్షియల్ ఎంటర్ టైన్మెంట్ రూపం సబ్జెక్ట్ తో.. బాలయ్యతో సినిమా చేస్తున్నట్లు టాక్. ఇదంతా పక్కన పెడితే వచ్చే బాలయ్య బాబు పుట్టినరోజు నాడు గోపీచంద్ మలినేని సినిమాకి సంబంధించి టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ వీడియో విడుదల చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్లు సమాచారం. మరొకటి అనిల్ రావిపూడి సినిమాకి సంబంధించి కొత్త అప్డేట్ బాలయ్య పుట్టినరోజునాడు రానున్నట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే బాలయ్య బర్తడే కి ఫ్యాన్స్ కి డబుల్ ధమాకా..అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!