HBD Prabhas: అక్టోబర్ 23వ తారీకు ప్రభాస్ 43వ పుట్టినరోజు కావటంతో రెండు తెలుగు రాష్ట్రాలలో అభిమానులు భారీగా సెలబ్రేట్ చేసుకున్నారు. తొలుతా పుట్టినరోజు వేడుకలకు ప్రభాస్ దూరంగా ఉంటున్నారని వార్తలు వచ్చాయి. దివంగత కృష్ణంరాజు మరణించడంతో కుటుంబ సభ్యులు మొత్తం బాధాకరంలో ఉండటంతో.. ప్రభాస్ వేడుకలకు దూరంగా ఉంటున్నారని ప్రచారం జరిగింది. కానీ అన్యూహాంగా ప్రభాస్ మాత్రం కేక్ కట్ చేయడం జరిగింది. ఇదే సమయంలో పుట్టినరోజు నాడు ఆయన నటిస్తున్న సినిమాల నుండి అప్డేట్స్ రావడంతో అభిమానులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.
తొలుత బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన “ఆది పురుష్” నుండి పోస్టర్ రిలీజ్ కావటం జరిగింది. ఆ తర్వాత నాకు అశ్విని దర్శకత్వం “ప్రాజెక్టు కే” నుండి కూడా ఫోటో రిలీజ్ చేశారు. చివరకు కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “సలార్” నుండి షూటింగ్ సెట్స్ లో ఉన్న ప్రభాస్ ఫోటో రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఫోటోలో దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ప్రభాస్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి… ఈ సంవత్సరం అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను అని అన్నారు. ఇందుకోసం తమ వంతుగా ప్రయత్నం కూడా చేస్తున్నట్లు తెలిపారు.
“సలార్” సెట్ లో నవ్వులు పూయిస్తున్న ప్రభాస్ ఫోటో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా వచ్చే ఏడాది సెప్టెంబర్ నెలలో విడుదల కానుంది. ప్రభాస్ నటించిన అన్ని సినిమాల్లో కంటే “సలార్” పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రుతిహాసన్ హీరోయిన్. మలయాళం యాక్టర్ హీరో పృథ్వి కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.