Anchor Suma: తెలుగు చలనచిత్ర రంగంలో యాంకర్ సుమ అందరికీ సుపరిచితురాలే. ఇండస్ట్రీలో టాప్ హీరోల సినిమాలకు సంబంధించి ప్రీ రిలీజ్ వేడుకలు సక్సెస్ మీట్ లు చాలా వరకు సుమకే ఎక్కువ యాంకరింగ్ బాధ్యతలు అప్పగిస్తారు. ఎంతటి పెద్ద హీరో అయినా సెలబ్రిటీ అయినా… చాలా అలవాకగా తన యాంకరింగ్ తో అలరిస్తూ…. ఈవెంట్ సక్సెస్ చేయడంలో యాంకర్ సుమ కీలకపాత్ర పోషిస్తూ ఉంటుంది. ఇండస్ట్రీలో దాదాపు విడుదల చాలా సినిమాలకు సుమ యాంకరింగ్ చేస్తే కచ్చితంగా హిట్ అవుతుంది అన్న సెంటిమెంట్ కూడా ఉంది.

ఇంకా టెలివిజన్ రంగంలో కూడా సుమా చాలా ప్రముఖుషోలకు యాంకరింగ్ చేస్తూ ఉంటారు. ఈటీవీలో ఇంకా సొంత యూట్యూబ్ ఛానల్ లో సుమ చేసే కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇటీవల ఆమె యాంకరింగ్ కి గుడ్ బై చెప్పినట్లు విపరీతంగా ప్రచారం జరిగింది. దీంతో యాంకర్ సుమ తనపై వస్తున్న వార్తలకు వీడియో రూపంలో క్లారిటీ ఇచ్చింది. ఆ వీడియోలో సుమా మాట్లాడుతూ..”ఇటీవల ఓ న్యూ ఇయర్ ఈవెంట్ షూట్ చేయడం జరిగింది. ఆ ఈవెంట్ కి సంబంధించి ప్రోమో ఇటీవల రిలీజ్ అయింది.

ఆ ప్రోమోలో తాను ఎమోషనల్ అయ్యింది వాస్తవమే. అయితే మొత్తం ఈవెంట్ చూస్తే అసలు విషయం ఏమిటో అర్థం అవుతుంది. కంగారు పడకండి నాకు చాలామంది ఫోన్ లు…ఇంకా మెసేజ్ లు చేస్తున్నారు. అయితే నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే నేను టీవీ కోసమే పుట్టా. నేను ఎంటర్టైన్మెంట్ కోసమే పుట్టా. నేను ఎటు వెళ్లడం లేదు. కాబట్టి మీరందరూ హాయిగా ఉండండి. మీకు ముందుగానే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తాను యాంకరింగ్ నుండి తప్పుకోవడం లేదని సుమ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు.