NBK: నందమూరి బాలయ్య బాబు ప్రస్తుతం మంచి స్పీడ్ మీద ఉన్నారు. గత ఏడాది బోయపాటి దర్శకత్వంలో “అఖండ” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని.. మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కిన బాలయ్య ప్రస్తుతం వరుసపెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే జూన్ పదవ తారీకు బాలయ్య పుట్టిన రోజు నేపథ్యంలో… అభిమానులకు డబుల్ బొనాంజా అనే టాక్ నడుస్తోంది. విషయంలోకి వెళితే బాలయ్యబాబు ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ఇటీవలే ఎన్టీఆర్ 100వ జయంతి సందర్భంగా కత్తి పట్టుకున్న బాలయ్య ఫోటో రిలీజ్ చేయడం జరిగింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే జూన్ 10వ తారీఖు బాలకృష్ణ పుట్టినరోజు నేపథ్యంలో ఈ సినిమా టైటిల్ తో కూడిన మరో కీలకమైన పోస్టర్ రిలీజ్ చేయటానికి సినిమా యూనిట్ రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే సమయంలో డైరెక్టర్ అనిల్ రావిపూడితో కూడా బాలయ్య సినిమా ఒప్పుకోవటం తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించి అప్డేట్ బాలయ్య పుట్టినరోజు నాడు ఇవ్వనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అనిల్ రావిపూడి చాలా కొత్తగా బాలయ్య బాబు ని చూపించడానికి స్క్రిప్ట్ రెడీ చేసినట్లు మొదటి నుండి వార్తలు వస్తున్నసంగతి తెలిసిందే.
ఇంతవరకు బాలయ్యబాబు కేరియర్ లో చేయని క్యారెక్టర్.. అనిల్ రావిపూడి సినిమాలో చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాల కోసం అప్ డేట్ లు బాలయ్య పుట్టినరోజు నాడు జూన్ పదవ తారీకు రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సో ఫ్యాన్స్ కి ఇది డబుల్ బొనాంజా అని అంటున్నారు. ప్రస్తుతం బాలయ్య బాబు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా రిలీజ్ చేసే ఆలోచనలో సినిమా యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అరే బాబు సరసన ఈ సినిమాలో శృతిహాసన్ నటిస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!