Aacharya: నేడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. పుట్టినరోజు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాదు.. తమిళనాడు ఇంకా మిగతా రాష్ట్రాల్లో భారీ ఎత్తున చెర్రీ పుట్టినరోజు వేడుకలు అభిమానులు చేస్తున్నారు. “ఆర్ఆర్ఆర్”లో టేరిఫిక్ పెర్ఫార్మెన్స్ తో… అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ స్క్రీన్ చిరిగిపోయే.. రీతిలో నటించడం జరిగింది. చరణ్ నటన అతి చాలా హైలెట్ గా మాత్రమే కాదు.. ఇండస్ట్రీ మహామహులను ఆశ్చర్యపరిచింది. నటన పరంగా రామ్ చరణ్ తేజ్ కెరియర్ లో “రంగస్థలం” ఒక ఎత్తయితే..”ఆర్ఆర్ఆర్” అంతకు మించి అన్నట్టు చూసిన జనాలు అభిమానులు అంటున్నారు. చిరంజీవి కొడుకు గా ఎంట్రీ ఇచ్చినా గాని.. చరణ్ తనదైన శైలిలో అభిమానులను ఆకట్టుకునే నటుడు అని చెప్పుకొస్తున్నారు.
దీంతో ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ తనను ఎంతగానో గర్వ పడే రీతిలో నిలబెట్టడం జరిగిందని చాలా సందర్భాల్లో తెలిపారు. ఇదిలా ఉంటే నేడు చరణ్ పుట్టిన రోజు నేపథ్యంలో కొరటాల శివ దర్శకత్వం లో చిరంజీవితో పాటు చరణ్ నటించిన “ఆచార్య” సినిమాకి సంబంధించి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో చరణ్ నవ్వుతూ ఫ్లూట్ పట్టుకుని… దాని మీద ఏదో రాస్తున్నాడు. వేసవి కాలంలో ఏప్రిల్ 29వ తారీకు ఆచార్య విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా.. చరణ్ బర్త్ డే కానుకగా.. ఆచార్య సినిమా యూనిట్ రిలీజ్ చేసిన స్పెషల్ పోస్టర్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చరణ్ స్టిల్ అభిమానులను ఆకట్టుకుంది. అదే సమయంలో తన పుట్టిన రోజునాడు ఎన్టీఆర్ కుటుంబంతో పాటు… రాజమౌళి కొడుకు కార్తికేయ ఫ్యామిలీ తో కూడా కలిసి చరణ్.. ఉపాసన ఫుల్ ఎంజాయ్ చేయడం జరిగింది. “ఆర్ఆర్ఆర్” లో కొమరం భీమ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ ఎన్టీఆర్ నువ్వానేనా అన్నట్టుగా.. నటించడం మాత్రమే కాదు స్టెప్పులు కూడా వేసి.. తిరుగులేని విజయాన్ని అందుకున్నారు. పాత సినిమా హిట్ అవడంతో పాటు చరణ్ బర్తడే ఒకేసారి రావడంతో ఎన్టీఆర్ చరణ్ రాజమౌళి ఫ్యామిలీ మెంబర్స్ ఫుల్ హ్యాపీగా చెర్రీ బర్తడే వేడుకలు చేసుకుంటూ ఉన్నారు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!