NewsOrbit
Entertainment News సినిమా

NTR 30: ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎదురుచూస్తున్న వార్త..!!

Share

NTR 30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరియర్ లో ఇది 30వ సినిమా. ఇటీవల ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమం ముగిసింది. “RRR” వంటి సినిమాతో ప్రపంచ స్థాయిలో హిట్ అందుకున్న తారక్ అదే తరహాలో ఈ సినిమాతో విజయం అందుకోవడానికి మంచి కసి మీద ఉన్నారు. గతంలో దర్శకుడు రాజమౌళితో సినిమాలు చేసిన తర్వాత ఎన్టీఆర్ వరుస పరాజయాలు అందుకున్నారు. అయితే ఇప్పుడు తన కెరీర్ లో ఈ 30వ సినిమాలో అటువంటి సెంటిమెంట్ రిపీట్ కాకుండా స్టోరీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారంట.

on the occasion of sri rama navami NTR 30 Movie Regular shooting details announced makers

ఈ సినిమాలో దివంగత శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. దక్షిణాది సినిమా రంగంలో ఇదే జాహ్నవికి ఫస్ట్ మూవీ. హీరోయిన్ శ్రీదేవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాదాపు మూడు దశాబ్దాల పాటు దక్షిణాది చలనచిత్ర పరిశ్రమని ఏలింది. అటువంటి స్టార్ హీరోయిన్ కూతురు కావడంతో జాహ్నవి కపూర్ ఏ రకంగా రానిస్తుందో ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా తీర్చిదిద్దినట్లు కొరటాల తెలియజేయడం జరిగింది.

on the occasion of sri rama navami NTR 30 Movie Regular shooting details announced makers

ఇదిలా ఉంటే నేడు శ్రీరామనవమి సందర్భంగా “NTR 30” సినిమా రెగ్యులర్ షూటింగ్ కి సంబంధించి అప్ డేట్ ఖరారు చేశారు. విషయంలోకి వెళ్తే మార్చి 31 నుండి అనగా రేపటి నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకి హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పనిచేస్తూ ఉండటంతో అంచనాలు మరింత పెరిగాయి. గతంలో ఎన్టీఆర్ తో కొరటాల తీసిన “జనతా గ్యారేజ్” సూపర్ హిట్ అయింది. ఇప్పుడు అదే తరహా హిట్టు తమ అభిమాన నటుడు ఎన్టీఆర్ కి పడాలని… ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.


Share

Related posts

Krishna Mukunda Murari: రేపటికి సూపర్ ట్విస్ట్ ఇచ్చిన ముకుంద.! సౌభాగ్యవ్రతంలో అపశృతి..!

bharani jella

Samantha – Naga Chaithanya: సమంతపై కసి తీర్చుకుంటున్న నాగ చైతన్య..ఇలా దెబ్బకొట్టబోతున్నాడా..?

GRK

Top Indian Crush: ఇండియాలో అదరగొట్టే క్రష్ భామలు వీళ్ళే..!!

bharani jella