29.2 C
Hyderabad
March 21, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Balakrishna Vs Akkineni: “అక్కినేని తొక్కినేని” వివాదంపై వివరణ ఇస్తూ.. మరోసారి “ANR” పై బాలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు..!!

Share

Balakrishna Vs Akkineni: “వీరసింహారెడ్డి” సక్సెస్ మీట్ లో బాలకృష్ణ ప్రసంగం వివాదాస్పదం కావడం తెలిసిందే. సినిమా విశేషాలు గురించి మాట్లాడుతూ మధ్యలో  ఆ రంగారావు ఈ రంగారావు…ఆ అక్కినేని ఈ తొక్కినేని అంటూ బాలయ్య చేసిన కామెంట్స్ పట్ల అక్కినేని ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బాలయ్య క్షమాపణములు చెప్పాలని కోరారు. ఇదే సమయంలో అక్కినేని ఫ్యామిలీలో నాగచైతన్య మరియు అఖిల్… బాలయ్య వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించడం తెలిసిందే. ‘నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్వీ రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు. వారిని అగౌరవపరచడం మనల్ని మనమే కించపరుచుకోవడం…’ అంటూ ట్వీట్ చేశారు. అయితే ఈ వివాదంలో అక్కినేని నాగార్జున స్పందించకపోవడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది.

Once again, Balayya's controversial comments on ANR

ఇక ఈ వివాదంపై హిందూపురం నియోజకవర్గంలో గురువారం పర్యటన క్రమంలో బాలకృష్ణ స్పందించారు. ఇష్టమైన వాళ్ళని ఎలాగైనా పిలుచుకోవచ్చు అన్న తరహాలో బాలయ్య తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ఈ క్రమంలో గతంలో ఎన్టీఆర్ నీ ఎన్టివోడు… అని పిలుచుకునేవారు. అదేవిధంగా ఏఎన్ఆర్ నీ నాగీ గాడు అని పిలుస్తారు అంటూ కొత్త వివాదానికి తెరలేపారు. నాగేశ్వరరావుని నాగిగాడు అనే పదంతో బాలయ్య చేసిన వ్యాఖ్యలపై… అభిమానులు మండిపడుతున్నారు. నాగిగాడు అని ఇప్పటివరకు ఎవరు అక్కినేని నాగేశ్వరరావుని పిలవలేదని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే అక్కినేని అంటే తనకు అభిమానం ఉందని స్పష్టం చేశారు.

Once again, Balayya's controversial comments on ANR

అక్కినేని నాగేశ్వరరావు తనని ఆప్యాయంగా పలకరించేవారు. నేను కూడా ఆయనను బాబాయి అని పిలిచేవాడిని. ఆయన ఇంటిలో ఉన్న పిల్లలందరి కంటే నేను అంటే ఎంతో ప్రేమ ఆప్యాయత. దానికి ప్రధాన కారణం అక్కడ ప్రేమ లేదు ఆప్యాయత లేదు…ఇక్కడ ఉందీ అంటూ పరోక్షంగా అక్కినేని ఫ్యామిలీపై… బాలయ్య వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో బాలయ్య అక్కినేని తొక్కినేని వివాదంపై ఇచ్చిన వివరణ మరింత వివాదాస్పదంగా మారింది. గౌరవం అంటూ నిండు సభలో ఇష్టానుసారంగా మాట్లాడటం ఎప్పుడు నాగిగాడు అంటూ.. బాలయ్య కామెంట్లపై అక్కినేని ఫ్యాన్స్ మరింతగా మండిపడుతున్నారు.


Share

Related posts

ఎస్ తనతో రిలేషన్ లో ఉన్నా… సీక్రెట్ రివీల్ చేసిన రాహుల్ సిప్లిగంజ్..?

GRK

Keerthy Suresh: చానల్ స్టార్ట్ చేసిన హీరోయిన్ కీర్తి సురేష్..!!

sekhar

Tamannah : తమన్నాకి ఇది సరిపోదు ఇంకా కావాలట..!

GRK