NewsOrbit
Entertainment News సినిమా

Custody: మరోసారి “కస్టడీ” ప్రమోషన్ కార్యక్రమాల్లో సమంతపై నాగచైతన్య కీలక వ్యాఖ్యలు..!!

Share

Custody: అక్కినేని నాగచైతన్య కొత్త సినిమా “కస్టడీ” మే 12వ తారీకు విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. నిన్ననే ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఫస్ట్ టైం నాగచైతన్య కెరియర్ లో కానిస్టేబుల్ పాత్రలో కనిపిస్తున్నారు. నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ గా చైతు నటిస్తున్న ఈ సినిమాని వెంకట్ ప్రభు దర్శకత్వం వహించటం జరిగింది. తమిళంలో చాలామంది స్టార్ హీరోలకు వెంకట్ ప్రభు మర్చిపోలేని హిట్లు ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉంటే “కస్టడీ” సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో నాగచైతన్య సమంత పై వరుస పెట్టి చేస్తున్న కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

Once again, Naga Chaitanya's key comments on Samantha in custody promotion programs

కొద్ది రోజుల క్రితం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఓ ఆంగ్ల మీడియా ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత గురించి మాట్లాడుతూ ఆమె మంచి మనసున్న వ్యక్తి అని నాగచైతన్య కొనియాడారు. అదే సమయంలో సోషల్ మీడియాలో లేనిపోని వార్తలు కారణంగా ఇద్దరి మధ్య గౌరవం లేదని.. జరిగిన ప్రచారం వల్లే విడిపోయినట్లు తెలిపారు. చట్టపరంగా విడాకులు తీసుకున్నట్లు నాగచైతన్య చెప్పుకొచ్చాడు. కాగా లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో మీ సహచర హీరోయిన్లలో నచ్చే క్వాలిటీస్ చెప్పాలని యాంకర్ ప్రశ్నించడం జరిగింది.

Once again, Naga Chaitanya's key comments on Samantha in custody promotion programs

ఈ క్రమంలో ముందుగా సమంతాలో హార్డ్ వర్క్ అంటే తనకు ఇష్టం అని నాగచైతన్య తెలిపారు. పూజా హెగ్డేలో స్టైల్, కృతి శెట్టిలో ఇన్నోసెన్స్ తనకు నచ్చుతాయని చైతు స్పష్టం చేయడం జరిగింది. వరుస పరాజయాలతో అక్కినేని హీరోల సినిమాలు.. బాక్సాఫీస్ వద్ద బోల్తాపడటంతో… “కస్టడీ” పై అభిమానులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో నాగచైతన్య వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నడూ లేని రీతిలో విడాకులు ఇచ్చిన తర్వాత సమంత పై నాగచైతన్య చేస్తున్న కామెంట్స్.. సోషల్ మీడియాలో ఊహించని రీతిలో వైరల్ అవుతూ ఉన్నాయి.


Share

Related posts

ఆదిత్యను నిలదీసిన సత్య.. అదిత్యకు కరాటే దేవి షాక్..! భాగ్యమ్మ మకాం రాధ ఇంట్లో..!

bharani jella

ర‌వితేజ మొద‌లెట్టేశాడు…

Siva Prasad

RRR: “RRR” కోసం “మగధీర” ప్లాన్ వేసిన రాజమౌళి..!!

sekhar