Unstoppable 2: పవన్ కళ్యాణ్ “అన్ స్టాపబుల్” పార్ట్ 2 ఎపిసోడ్ కి సంబంధించి కొత్త ప్రోమో ఆహా టీం రిలీజ్ చేయడం జరిగింది. ఫిబ్రవరి 9వ తారీకు రాత్రి 9 గంటలకు స్ట్రీమింగ్ కానుందని స్పష్టం చేయడం జరిగింది. ఈ ప్రోమోలో మొదటి పార్ట్ ఎపిసోడ్ సృష్టించిన రికార్డులు ఇంకా అనేక విషయాలు చూపించారు. బాలయ్య మరియు పవన్ నవ్వుకుంటున్న దృశ్యాలను అద్భుత రీతిలో చూపించడం జరిగింది. మొదటి పార్ట్ ఎపిసోడ్ లో పవన్ వ్యక్తిగత, కుటుంబ మరియు సినిమాకి సంబంధించి బాలయ్య పలు ప్రశ్నలు వేయడం జరిగింది.
డైరెక్టర్ త్రివిక్రమ్ తో స్నేహం గురించి కూడా ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ వీటికి సంబంధించిన ఇచ్చిన జవాబులు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అదే రీతిలో మూడు పెళ్లిళ్లు గురించి పవనిచ్చిన సమాధానానికి తర్వాత అదే.. విమర్శ చేస్తే ఊరుకొక్కలతో సమానమని బాలకృష్ణ అనటం హైలెట్ అయింది. రెండవ సీజన్ లో చివరి ఎపిసోడ్ కావటంతో పవన్ షోకి ఆహా టీం భారీ ఎత్తున ప్రచారం చేస్తూ ఉంది. దీనిలో భాగంగా అనేక ప్రోమోలో రిలీజ్ చేయడం జరిగింది. ఈ క్రమంలో లేటెస్ట్ గా సెకండ్ పార్ట్ ఎపిసోడ్ ఫిబ్రవరి 9వ తారీకు రాత్రి 9 గంటలకు ప్రసారం కానున్నట్లు కొత్త ప్రోమో రిలీజ్ చేయడం జరిగింది.
రెండో భాగంలో చాలావరకు రాజకీయానికి సంబంధించి బాలయ్య ప్రశ్నలు వేశారు. 2024 ఎన్నికలకు జనసేన పార్టీ పయనం ఇంకా తెలుగుదేశం పార్టీతో పొత్తు ఇలా అనేక రకాల విషయాలకు సంబంధించి బాలయ్య వేసిన ప్రశ్నలు అటు పొలిటికల్ గా ఇటు ఎంటర్టైన్మెంట్ పరంగా పవన్ ఎటువంటి సమాధానాలు ఇస్తాడు అన్నది అందరూ ఉత్కంఠ భరితంగా ఎదురుచూస్తున్నారు. ఇక సెకండ్ పార్ట్ లో పవన్ కళ్యాణ్ తో డైరెక్టర్ క్రిష్ జాయిన్ కావడం జరిగింది. మొదటి పార్ట్ లో మెగా హీరో సాయిధరమ్ తేజ్ పాల్గొన్నారు.