RRR: మరికొద్ది రోజుల్లో ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం జరగనున్న సంగతి తెలిసిందే. ప్రపంచ సినిమా రంగంలో ఆస్కార్ అవార్డుకి మంచి క్రేజ్ ఉంది. ఈ క్రమంలో “RRR” ఈ అవార్డు సాధించే దిశగా దూసుకుపోతోంది. “RRR” కీ ఇండియా నుంచి అధికారికంగా ఆస్కార్ ఎంట్రీ లభించకపోవడంతో.. సొంతంగా ఆస్కార్ బరిలో నిలవడం తెలిసిందే. ఈ క్రమంలో అమెరికాలో “RRR” డిస్ట్రిబ్యూటర్స్.. ఆస్కార్ అకాడమీ సభ్యులకు స్పెషల్ స్క్రీన్స్ వేసి… భారీ ఎత్తున ఖర్చు చేయడం జరిగింది.
ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో రాజమౌళి కూడా పాల్గొని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. దర్శకుడు రాజమౌళి మాత్రమే కాకుండా ఇద్దరు హీరోలు ఎన్టీఆర్ చరణ్ లతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కూడా పాల్గొన్నారు. దీంతో ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో “RRR” లోని “నాటు నాటు” సాంగ్ ఆస్కార్ కి నామినేట్ అయ్యింది. అయితే “RRR” ఆస్కార్ బరిలో నిలవడానికి.. దర్శకుడు రాజమౌళి ₹83 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం. “నాటు నాటు” సాంగ్ దేశ విదేశాలలో మారుమ్రోగుతోంది. ఇటీవల ఫేమస్ BTS సింగర్ జంగ్ కుక్ ఇంస్టాగ్రామ్ లైవ్ లో తనకిష్టమైన సాంగ్స్ లో ఈ సాంగ్ ప్లే చేయడం జరిగింది.
దీంతో ఈ వీడియోను “RRR” టీం సోషల్ మీడియాలో పోస్ట్ చేసి..”మీరు నాటు నాటును ఎంతగానో ప్రేమించడం ఆశ్చర్యంగా ఉంది. మీకు టన్నులు కొద్దీ మా ప్రేమను పంపుతున్నాం”.. అని పోస్ట్ పెట్టడం జరిగింది. ఇదిలావుండగా “RRR”కీ చాల అంతర్జాతీయ అవార్డ్ లు వచ్చాయి. గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా రావడం జరిగింది. దీంతో “RRR” గ్యారంటీగా ఆస్కార్ గెలిచే అవకాశాలున్నాయి అనీ సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.