బిగ్ స్టోరీ సినిమా

కాజల్ పెళ్లికి టాలీవుడ్ నుండే ఒక్కడే హీరో వెళ్తున్నాడు..! అతడే ఎందుకు?

Share

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ కు మిగతా వారికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. కాజల్ రాణించినంతగా సమకాలీన అగ్రతారల లో ఏ ఒక్క హీరోయిన్ నిలకడగా రాణించలేకపోయారు. అయితే దశాబ్దన్నర కాలంగా ఇక్కడ సినిమాలు చేస్తున్న కాజల్ కు…. టాలీవుడ్ లోని ప్రముఖులతో వ్యక్తిగతంగా స్నేహం చేయడం కూడా చాలా తక్కువ. అలాంటి కాజల్ తన పెళ్లి విషయం గురించి వెల్లడించి ఎంతోమంది అభిమానుల హృదయాలను బద్దలు కొట్టేసింది..!

 

కాజల్ పెళ్లికు డుమ్మా కొట్టక తప్పదు….

విషయానికి వస్తే ఇండస్ట్రీలో ఇప్పటి వరకూ అగ్ర తారగా వెలుగొందిన అనుష్క, సమంత, రకుల్ ప్రీత్ సింగ్ వంతి నాయికలు ఇండస్ట్రీ వారితో బాగా సన్నిహితంగా ఉంటారు. రకుల్ కి ఫ్రెండ్స్ ఎక్కువ. ఇక అనుష్క కు నాగార్జున కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయి. సమంత అయితే ఏకంగా తెలుగింటి ఆడపడుచు అయిపోయింది. వీరందరితో పోలిస్తే కాజల్ వ్యవహారం…. సినిమా చేశామా బొంబాయి వెళ్ళిపోయామా అన్నట్లు ఉండేది. ఇక ఈ నేపథ్యంలో ఈ నెల చివర్లో జరుగుతున్న కాజల్ పెండ్లికి టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరైనా వెళ్తారా అనేది సందేహం గానే ఉంది…. మామూలు రోజుల్లో అయితే సరే కానీ పెళ్లి కరోనా కష్టకాలంలో అది కూడా హైదరాబాద్ లో కాదు.

రెండు సినిమాలకే ఇంత క్లోజా…?

ఇక ముంబైలో జరగబోయే కాజల్ పెళ్లికి పరిమిత సంఖ్యలో మాత్రమే అతిథులు హాజరవుతున్నారు. ఇక స్టార్ హీరోల సంగతి పక్కన పెడితే హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం కాజల్ పెళ్లికి హాజరు కాబోతున్నాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించాడు .చివర్లో బెల్లంకొండ శ్రీనివాస్ తో ఒకటికి రెండు సినిమాలు చేసిన కాజల్ తన పెళ్ళికి బెల్లంకొండ రావడం చూసి అందరూ ఆశ్చర్య పడుతున్నారు. ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ హీరోలతో రెండేసి మూడేసి సినిమాలు చేసిన కాజల్…. బెల్లంకొండ తో అయినంత క్లోజ్ ఎవరితో కాలేదు అని కొన్ని ఫోటోలను బట్టి తెలుస్తోంది.

రూమర్లకు చెక్….

లాక్ డౌన్ సమయంలో కూడా కాజల్ ను మిస్ అవుతున్నట్లు శ్రీనివాస్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం చర్చనీయాంశమైంది. ఇక అప్పుడు అందరూ శ్రీనివాస్-కాజల్ పెళ్లి జరగబోతుంది అని రూమర్లు క్రియేట్ చేశారు. అయితే కాజల్ నా బెస్ట్ ఫ్రెండ్.. గౌతమ్ వంటి వ్యక్తి ఆమెకు దొరకడం నిజంగా నా అదృష్టం .వారిద్దరికీ నా శుభాకాంక్షలు అని శ్రీనివాస్ చెప్పడంతో అవన్నీ ఆగిపోయాయి. ఎంతైనా కాజల్ పెళ్లికి కేవలం బెల్లంకొండ శ్రీనివాస్ టాలీవుడ్ హీరోల నుండి వెళుతున్నాడు అంటే అతడికి ఆమె ఎంత స్పెషల్ అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.


Share

Related posts

వైరల్ వీడియో : బిగ్ బాస్ అంతా స్క్రిప్ట్ ప్రకారమే జరిగింది…? ఇదిగో ప్రూఫ్…!

siddhu

Prabhas: మీలో ఈ టాలెంట్ ఉంటే ‘ప్రాజెక్ట్‌ K’లో ఛాన్స్ మీకే..

GRK

Sukumar: పుష్ప 2 కంటే ముందు సుకుమార్ చెయ్యబోతున్న బిగ్ డీల్ ఇదే..

GRK