Samantha: కెరియర్ పరంగా సమంత దూసుకుపోతుంది. గత ఏడాది నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత మరింతగా అవకాశాలు అందుకుంటూ ఉంది. సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలు ఇంకా వెబ్ సిరీస్ లు చేస్తోంది. ముఖ్యంగా “ఫ్యామిలీ మ్యాన్ 2″తో బాలీవుడ్ ప్రేక్షకులకు సమంత బాగా కనెక్ట్ అయ్యింది. ఆ తర్వాత “పుష్ప”లో ఐటమ్ సాంగ్ చేయడంతో మరింత క్రేజ్ దక్కించుకుంది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ నేపథ్యంలో ఓర్మాక్స్ ( ORMAX) మీడియా ఏప్రిల్ నెలలో నిర్వహించిన సర్వేలో ఇండియా లోనే టాప్ మోస్ట్ హీరోయిన్ గా ఫస్ట్ ప్లేస్ లో సమంత స్థానం దక్కించుకుంది. దీంతో ఈ వార్త సంచలనంగా మారింది. ORMAX మీడియా విడుదల చేసిన మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్స్ లో సమంత ఫస్ట్ ర్యాంక్ దక్కించుకుంది. ఆ తర్వాత ఆలియా భట్, నయనతార, దీపికా పదుకొనే, కాజల్ అగర్వాల్, కీర్తి సురేష్, కత్రినా కైఫ్, రష్మిక మందన, పూజా హెగ్డే, అనుష్క శెట్టి నిలవడం జరిగింది. ఏకంగా బాలీవుడ్ హీరోయిన్ లను సైతం వెనక్కి నెట్టి టాప్ పొజిషన్ లో సమంత సత్తా చాటడం బాలీవుడ్ మీడియాలో కూడా సంచలనంగా మారింది.
ఇదిలా ఉంటే సమంత ప్రస్తుతం హాలీవుడ్ ఇండస్ట్రీలో శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ప్రేమ కథ నేపథ్యం కలిగిన “ఖుషి” సినిమాల్లో నటిస్తోంది. బాలీవుడ్ ఇండస్ట్రీ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కొత్త మూవీలో ఇటీవల చాన్స్ అందుకున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మొత్తంమీద చూసుకుంటే కెరీర్ పరంగా సమంత ఇప్పుడు ఇండియాలోనే టాప్ మోస్ట్ హీరోయిన్ గా ORMAX మీడియాలో ర్యాక్ సాధించింది.