Oscar 2023: తెలుగు చలనచిత్ర రంగానికి సంబంధించి “RRR” ఆస్కార్ రేసులో ఉండటంతో గతంలో ఎన్నడూ లేనంతగా భారతీయులు ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ కోసం ఎదురుచూస్తున్నారు. అమెరికాలో ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో జరగనుంది. అయితే అక్కడ సమయానికి ఇక్కడ ఇండియన్ టైమింగ్స్ కి చాలా వ్యత్యాసం ఉంది. ఈ క్రమంలో భారతీయ కాలమాన ప్రకారం.. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో ఆస్కార్ వేడుకలు.. అమెరికా యొక్క టైమింగ్ ప్రకారం ఈనెల 12.. ఆదివారం రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్నాయి. అయితే భారతీయ కాలమాన ప్రకారం సోమవారం ఈ నెల 13వ తారీకు ఉదయం ఐదున్నర గంటలకు ఏబీసీ ఛానల్ లో ఈ ప్రోగ్రాం టెలికాస్ట్ కానుంది.
దీంతో “RRR” ఆస్కార్ అవార్డు గెలవాలని భారతీయ సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు. మరోపక్క ఈ ప్రతిష్టాత్మక అవార్డు కలవడానికి “RRR” టీం కూడా భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలకు ఖర్చు పెట్టడం జరిగింది. దర్శకుడు రాజమౌళి పేరు ప్రపంచ సినిమా రంగంలో మారుమొగుతుంది. “RRR”తో మరోసారి జక్కన్న తన దర్శకత్వ దమ్మేంటో నిరూపించాడు. గత ఏడాది మార్చి నెలలో విడుదలైన ఈ సినిమా ఇండియాలోనే కాదు విదేశాలలో సూపర్ డూపర్ హిట్ అయింది. ఏకంగా ₹1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.
ఈ సినిమాలో “నాటు నాటు” సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ముఖ్యంగా ఈ సాంగులో చరణ్ మరియు ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు చాలా హైలెట్ అయ్యాయి. హాలీవుడ్ సినీ ప్రేక్షకులు… ఈ స్టెప్పులకు థియేటర్లలో తెగ సందడి చేయడం జరిగింది. అయితే ఇప్పుడు అదే సాంగ్ ఆస్కార్ రేసులో ఉండటంతో కచ్చితంగా.. గెలిచే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.