NewsOrbit
సినిమా

villains : అక్కడ స్టార్ హీరోస్… తెలుగులో మాత్రం సూపర్ విలన్స్..?

other-language-heroes-performing-as-villain-in-tollywood-movies

villains: సినిమా ఇండస్ట్రీలో తెలుగు రేంజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం తెలుగు సినిమాలు దేశవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందాయి. మన తెలుగు సినిమాలలో నటించడం కోసం ఎంతో మంది ఇతర భాషలలో నటించే నటీనటులు తెలుగులో అవకాశాలకోసం ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలోనే మన తెలుగు సినిమాలలో నటించడం కోసం ఇతర భాషలలో స్టార్ హీరోలైన ఎంతోమంది ఇక్కడ విలన్లుగా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ విధంగా పలు భాషలలో గుర్తింపును సంపాదించుకున్న ఆ స్టార్ హీరోలు ప్రస్తుతం తెలుగు సినిమాలలో విలన్లుగా నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. అయితే ఇతర భాషలలో స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకొని తెలుగులో విలన్లుగా నటించిన కొందరి గురించి ఇక్కడ తెలుసుకుందాం…

other-language-heroes-performing-as-villain-in-tollywood-movies
other language heroes performing as villain in tollywood movies

1) ఫహాద్ ఫాజిల్:
ఫహాద్ ఫాజిల్ మలయాళంలో సూపర్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న ఈ హీరో తెలుగులో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాలో విలన్ పాత్రలో నటించడం కోసం సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ విషయం గురించి చిత్రబృందం అధికారిక ప్రకటన కూడా చేశారు.

2) విజయ్ సేతుపతి:
తమిళంలో స్టార్ హీరోగా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న విజయ్ సేతుపతి మాస్టర్ సినిమా ద్వారా తన విలనిజాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మాస్టర్ సినిమా తర్వాత ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతి నటనకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.

3) సుదీప్:
కన్నడ భాషలో సూపర్ స్టార్ గా దూసుకుపోతున్న సుదీప్ ఈగ సినిమాలో విలన్ గా నటించిన అందరిని ఆకట్టుకున్నారు. ఈగ సినిమా మాత్రమే కాకుండా పులి సినిమాలో కూడా విలన్ గా సందడి చేశారు.

4) రవి కిషన్:
భోజ్ పురిలో సూపర్ స్టార్ గా వెలిగిపోతున్న రవి కిషన్ తెలుగులో విలన్ పాత్రలో అద్భుతంగా నటించారు. అల్లు అర్జున్ నటించిన రేసుగుర్రం చిత్రంలో మద్దాలి శివారెడ్డి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి మంచి ఆదరణ పొందారు

5) అనిల్ కపూర్:
బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కపూర్ కూడా ఇప్పుడు విలన్ పాత్రలో తెలుగులో అడుగుపెట్టబోతున్నాడనే విషయం తెలుస్తుంది. మహేష్ బాబు నటిస్తున్న సర్కారీ వారి పాట చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నారని సమాచారం వినబడుతుంది. అయితే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఏదిఏమైనా ఇతర భాషల్లో స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్న వీరందరూ ఇక్కడ స్టార్ విలన్లుగా పేరు సంపాదించడంతో పాటు అధిక పారితోషకాన్ని కూడా తీసుకుంటున్నారని తెలుస్తోంది.

Related posts

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri