సినిమా

Tollywood: అరడజనకు పైగా సినిమాలతో మన హీరోలు.. ఇంకో 4ఏళ్ల వరకు నిర్మాతలు వారివైపు చూడాల్సిన పని లేదు!

Share

Tollywood:కరోనా మహమ్మారి ఎఫెక్ట్ అన్ని రంగాల్లో పెను మార్పులే తీసుకొచ్చింది. ముఖ్యంగా సినీ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. కరోనా తరువాత ఇప్పడు ఒక్కో స్టార్ చేతిలో ఇంచుమించుగా ఐదారు సినిమాలున్నాయంటే దానికి ప్రధాన కారణం కరోనానే అని వేరే చెప్పనవసరం లేదు. దాదాపు రెండేళ్లుగా షూటింగ్ లు, సినిమా రిలీజ్ లు లేకపోవడంతో ఇపుడు ప్రతీ ఒక్కరి చేతిలో అరడజనకు పైనే సినిమాలున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నుంచి ఆది సాయికుమార్ వరకు ప్రతీ ఒక్కరు ఐదేసి చిత్రాలతో తమ డైరీని ఫుల్ చేసేశారు.

Our Tollywood heroes with more than half of the movies .. Producers do not have to look at them for another 4 years!
Our Tollywood heroes with more than half of the movies .. Producers do not have to look at them for another 4 years!

చేతినిండా సినిమాలతో మన హీరోలు

మెగాస్టార్ చిరంజీవి విషయానికొస్తే, ప్రస్తుతం 5 చిత్రాల్లో నటిస్తున్నారు. ‘ఆచార్య’ రిలీజ్ కు రెడీ అవుతుండగా ‘గాడ్ ఫాదర్’ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఇక బాబీతో ‘వాల్తేరు వీరయ్య’ని తాజాగా పట్టాలెక్కించారు. దీని తరువాత మెహర్ రమేష్ రూపొందిస్తున్న ‘భోళా శంకర్’లో నటించనున్నారు. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో చిరుకు సోదరిగా కీర్తి సురేస్ కనిపించబోతోంది. అలాగే DVV దానయ్య నిర్మాణంలో వెంకీ కుడుముల చిత్రాన్ని కూడా చేస్తున్నారు. ఆ తరువాత సుకుమార్ దర్శత్వంలో చేయడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు.

Our Tollywood heroes with more than half of the movies .. Producers do not have to look at them for another 4 years!
Our Tollywood heroes with more than half of the movies .. Producers do not have to look at them for another 4 years!

లిస్టులో మిగిలిన హీరోలు వీరే:

చిరు తరువాత ఇదే రేంజ్ లో బిజీగా వున్న హీరో రవితేజ. మనోడు ప్రస్తుతం నాలుగు సినిమాలతో ఫుల్ బిజీ. దర్శకుడు సతీష్ మండవ చేస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఆ తరువాత క్యూలో వుంది పవన్ కల్యాణ్. ప్రస్తుతం ‘హరి హర వీరమల్లు’ చిత్రంలో నటిస్తున్నారు. పవన్ కూడా నాలుగు చిత్రాలతో లాక్ అయ్యాడు. అలాగే రామ్ చరణ్ ఇప్పటికే శంకర్ తో ఓ సినిమా చేస్తున్నారు. దీని తరువాత ఓ మూడు సినిమాలను లైన్ లో పెట్టేసాడు. ఇక ఆది సాయి కుమార్ చేతిలో దాదాపు 5 సినిమాలు వుండటం విశేషం. కాబట్టి నిర్మాతలారా! వీరి పక్కకు మీరు ఓ 3, 4 ఏళ్ళ తరువాతే వెళ్ళండి.


Share

Related posts

Jabardasth Comedians : జబర్దస్త్ కమెడియన్స్ ను ఆ గెటప్ లో చూసి షాక్ అయిన దర్శకుడు..?

Teja

NTR: ప్ర‌భాస్‌, మ‌హేష్‌, బ‌న్నీల‌ను వెన‌క్కి నెట్టి టాప్-1లోకి వ‌చ్చిన‌ ఎన్టీఆర్‌.. ఇదీ క‌దా రికార్డు!

kavya N

Allu Arjun: పాన్ ఇండియా లెవెల్ లో రికార్డుల వేట అప్పుడే స్టార్ట్ చేసిన అల్లు అర్జున్..??

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar