సినిమా

KGF 2: ఓవర్ ఆల్ ఇండియా వైడ్ గా “కేజిఎఫ్ 2” మరో సెన్సేషనల్ రికార్డ్..!!

Share

KGF 2: ఏప్రిల్ 14 వ తారీకు రిలీజ్ అయిన “కేజిఎఫ్ 2” బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. “కేజిఎఫ్” మొదటి చాప్టర్ సూపర్ డూపర్ హిట్ కావడంతో…”కేజిఎఫ్ 2″ పై సినిమా ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా “కేజిఎఫ్ 2″ నీ అయి వోల్టేజ్ యాక్షన్ సినిమాగా ప్రజెంట్ చేసి రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. హీరో యాష్ నీ ఓ రేంజ్ లో చూపించడంతో… పాటు యాక్షన్ సన్నివేశాలు మరింతగా చిత్రీకరించడంతో..”కేజిఎఫ్ 2” థియేటర్లకు జనాలు పోటెత్తారు. సినిమా రిలీజ్ అయిన రోజు సెకండ్ షో పడకముందే వంద కోట్లు కలెక్ట్ చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

Overall india KGF 2 created another record

“కేజిఎఫ్ 2” ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటికే అనేక రికార్డులు సృష్టించడం తెలిసిందే. అయితే తాజాగా ఇండియా వైడ్ గా ఓవరాల్ గా మరో సెన్సేషనల్ రికార్డ్ “కేజిఎఫ్ 2” క్రియేట్ చేయడం జరిగింది. హైయెస్ట్ గ్రాస్ ఇండియాలో సాధించిన రెండో సినిమాగా “కేజిఎఫ్ 2” హిస్టరీ క్రియేట్ చేయడం జరిగింది. సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 20 రోజులు పై గానే ఉన్నా గానీ కలెక్షన్లు వస్తూ ఉండటంతో.. ఓవరాల్ గా కలెక్షన్ పరంగా “కేజిఎఫ్ 2” ఎంత నెంబర్ సెట్ చేస్తుంది అన్నది సస్పెన్స్ గా నెలకొంది.

 

ఈ సినిమా విజయంతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఇండియాలోని టాప్ మోస్ట్ డైరెక్టర్ గా క్రేజ్ సంపాదించాడు. రాజమౌళి తర్వాత..స్థానం ప్రశాంత్ నీల్ దే అని అంటున్నారు. హీరో యాష్ మార్కెట్ కూడా నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో పెరిగింది. ఇదిలా ఉంటే “KGF 2” చివరిలో మూడో చాప్టర్ అని హింట్ ఇవ్వటంతో.. అభిమానులు ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందో అని ఆశగా ఎదురు చూస్తున్నారు.


Share

Related posts

Narappa: నారప్ప సినిమా వాయిదా..

bharani jella

Trisha: మళ్లీ పవర్ స్టార్ తో నటించడానికి రెడీ అవుతున్న హీరోయిన్ త్రిష..??

sekhar

థియేటర్ లకి సిద్ధం అవ్వండి .. తెలుగు ఇండస్ట్రీ విందు భోజనం సిద్ధం చేసింది !

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar