చిన్న సినిమాలు పెద్ద హిట్ అయినప్పుడు ఆ సినిమాలో నటించిన నటీనటులకు వచ్చే ఎక్స్ పోజర్ ఓ రేంజ్లో ఉంటుంది. ఉదాహరణకి లేటెస్ట్ గా ఆర్.ఎక్స్.100లో నటించిన హీరో, హీరోయిన్ల పేర్లు మారుమోగినట్టు. ఈ సినిమా తర్వాత పాయల్ అస్సలు ఖాళీ లేదు. కె.ఎస్.100 అని ఓ సినిమా చేస్తోంది. ఇటీవల తేజ దర్శకత్వం వహించిన `సీత`లోనూ స్పెషల్ సాంగ్‌కి ఆడిపాడింది. అసలే హాట్ హీరోయిన్ అని పేరున్న పాయల్ అందులో అందాలు మరింత ఒలకబోసేసరికి ఇప్పుడు స్పెషల్ నెంబర్స్ ప్రస్తావన ఎక్కడ వచ్చినా,, అక్కడ పాయల్ పేరు ఇట్టే వినిపిస్తోంది. తాజాగా `సాహో` సినిమా విషయంలోనూ జరిగింది అదే. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో పాయల్ చేస్తున్నట్టు వార్తలొచ్చాయి. ఆగస్ట్ 15న విడుదల కానుందని యూనిట్ ఇప్పటిక చాలా సార్లు స్పష్టం చేసింది. రెండున్నర నెలలు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ఇంకాస్త బ్యాలన్స్ ఉంది. పాటలను చిత్రీకరించలేదు. మరోవైపు శంకర్-ఎహసాన్-లాయ్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చే మ్యూజిక్ డైరక్టర్ ఈ సినిమాకు పాటలు చేసి, రీరికార్డింగ్ చేయాలి. సో ఐటమ్ సాంగ్‌లో పాయల్ నటించే అవకాశాలు మెండుగా ఉన్నాయని వార్తలు వచ్చాయి. అయితే అలాంటివేమీ లేవని పాయల్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా కన్ఫర్మ్ చేసింది. శ్రద్ధా కపూర్ నాయికగా నటించిన సినిమా ఇది. నీల్ నితిన్ ముఖేష్ కీలక పాత్రధారి. యాక్షన్ స్టడ్డెడ్ చిత్రంగా ఉండబోతోంది. యువీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ప్రభాస్ షేర్ చేసే ఫొటోలకు మరింత స్పందన వస్తోంది.సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు.
previous post
next post
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!