RRR: “ఆర్ఆర్ఆర్” మేనియా ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతోంది. మహమ్మారి కరోనా ప్రపంచం లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏ సినిమాకీ రాని రీతిలో ఈ సినిమాకి హైప్ విపరీతంగా పెరిగిపోయింది. కారణం “బాహుబలి” సినిమా తీసిన డైరెక్టర్ రాజమౌళి “ఆర్ఆర్ఆర్” కి దర్శకత్వం వహించడం. బాహుబలి తో… ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అన్ని రికార్డులను బ్రేక్ చేసిన రాజమౌళి “ఆర్ఆర్ఆర్” తో… ఇటువంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడో… అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు.
ఈ సినిమాపై బయటపెట్టుకున్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా జక్కన్న తన టేకింగ్ తో “ఆర్ఆర్ఆర్” ద్వారా అనేక రికార్డులు బద్దలు కొట్టడం స్టార్ట్ చేసాడు. సినిమా మొదటి షో పడిన నాటి నుండి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడం తో సామాన్య ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు..”ఆర్ఆర్ఆర్” చూడటానికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే చిరంజీవి ఫ్యామిలీ, బన్నీ ఫ్యామిలీ తో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా చూసి సోషల్ మీడియాలో తమదైన శైలిలో రియాక్ట్ అయ్యారు.
దర్శకుడు రాజమౌళిని పొగడ్తలతో ముంచెత్తడం మాత్రమే కాదు నటన పరంగా చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు తమ బెస్ట్ ఇచ్చారనీ..”ఆర్ఆర్ఆర్” ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్థాయిని పెంచింది అని సెన్సేషనల్ కామెంట్స్ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఇప్పుడు ప్రభాస్ కూడా ఈ సినిమా చూడటానికి రెడీ అయినట్లు లేటెస్ట్ టాక్ నడుస్తోంది. వాస్తవానికి సినిమా ముందుగానే చూడాలని ప్రభాస్ అనుకోక కొన్ని కారణాల వల్ల వాయిదా పడినట్లు దీంతో దానికి స్పెషల్ షో హైదరాబాదులో సోమవారం మహేష్ బాబు థియేటర్ లో బుక్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా బాహుబలి కంటే బాగుందని బయటకు రావడంతో పాటు రికార్డులు బ్రేక్ చేస్తూ ఉండడంతో..”ఆర్ఆర్ఆర్” సినిమా యూనిట్ ఫుల్ ఖుషీగా ఉంది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!