సినిమా

పలాస పార్వతీశం: డబ్బులేక గుళ్ళదగ్గర భోజనం చేసేవాడిని: నటుడు పలాస పార్వతీశం

Share

 పలాస పార్వతీశం అంటే ఎవరో తెలుసా? అదేనండి ‘కేరింత’ సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయిన ఓ నటుడు. కాగా ఇతగాడిది పలాస. అందుకే అతనిని అందరూ పలాస పార్వతీశం అని అంటూ వుంటారు. ఇక ఇక్కడ అవకాశాలకోసం అనేక కష్టాలు కష్టాలు పడ్డాడు. తాజాగా తను ఎదుర్కొన్న కష్టాల గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. కేరింత సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు పార్వతీశం. తన చదువు పూర్తి అయ్యాక చదువుకోకుండా సినిమాలలో నటించాలని కలతోనే ఇండస్ట్రీలోకి వచ్చారట. అలా తను ఇండస్ట్రీలో రావడానికి ఎంత స్ట్రగుల్ అయ్యాడు వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

palasa-parvathisam

ఇండస్ట్రీలో అవకాశం కోసం తిరుగుతున్న సమయంలో.. తన దగ్గర తినడానికి చిల్లి గవ్వకూడ ఉండేది కాదట. అందుచేతనే తన స్నేహితులు ఎప్పుడూ తనకి సహాయం చేసే వారిని.. అయితే తినడానికి చాలా ఇబ్బందులు వచ్చిన సమయంలో తను ఇస్కాన్ గుడిలో ప్రవచనాలు చెప్పి ఫ్రీగా అక్కడ భోజనం తింటూ ఉండే వారిని తెలిపారు. అలా దాదాపుగా ఎన్నో నెలలు చేశారని కూడా తెలిపారు. ఒకవేళ అక్కడ దొరక్కపోతే.. గాంధీ హాస్పిటల్ దగ్గర వైద్యులకు ఉచితంగా భోజనం పెడతారని.. ఇక తమ రూమ్ దగ్గర చాలామంది డాక్టర్లు ఉండేవారని వాళ్లతో పాటు కలసి అక్కడికి వెళ్లి భోం చేసే వారిని తెలిపారు.

palasa-parvathisam

అలా ఎన్నో రోజులపాటు గడిపిన తరువాతనే అవకాశాలు వచ్చాయని చెప్పుకొచ్చాడు. ఇక కేరింత సినిమాలో అవకాశం రావడంతో తన లైఫ్ చేంజ్ అయిందని తెలిపారు. మళ్లీ సాయికుమార్ కొడుకు నటించిన ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమాలో నటించమని అవకాశం రావడంతో నటించానని, అయితే ఈ సినిమాలో పాత్ర చాలా తక్కువగా ఉందని తెలిపారు. మొదట స్క్రిప్ట్ చెప్పిన దానికి తీసిన దానికి అసలు పొంతన ఉండేది కాదని తెలిపారు. అయితే సినిమా ఒప్పుకున్నాక వద్దని చెప్పలేక సినిమాలో నటించానని చెప్పుకొచ్చారు.


Share

Related posts

Bala Krishna: బాలయ్యబాబుతో ఛాన్స్ కొట్టేసిన మన వంటలక్క.. ప్లాన్ మామ్మూలుగా లేదుగా..?

Ram

Tollywood: పెళ్లయిన తర్వాత రెండోసారి సినిమా చేయడానికి రెడీ అవుతున్న హిట్ పెయిర్..??

sekhar

Pawan Kalyan : ఓపక్క వకీల్ సాబ్ మ్యానియా.. మరోపక్క కరోనా..! ఏంటో పరిస్థితి..!?

Muraliak