RRR – Radhe shyam: పాన్ ఇండియన్ సినిమాలు ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ పోస్ట్‌పోన్..అదే జరిగితే ఇండస్ట్రీ మొత్తం నష్ఠాల్లోనే ..!

Share

RRR – Radhe shyam: గత ఏడాది నుంచి కరోనా దెబ్బ సినిమా ఇండస్ట్రీ మీద ఎంతగా ప్రభావం చూపుతుందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే రెండు వేవ్స్ తట్టుకొని ఇండస్ట్రీ కోలుకుంటున్న సమయంలో ఇప్పుడు ఒమిక్రాన్ అని మళ్ళీ థర్డ్ వేవ్ మొదలై అందరినీ ఒణికిస్తోంది. ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాలను రిలీజ్ చేసేందుకు షెడ్యుల్ ప్లాన్ చేసి డేట్ లాక్ చేసుకుంటున్నారు. ఇటీవల వచ్చిన అఖండ, పుష్ప వసూళ్ళ పరంగా కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసి అందరికీ గట్టి ధైర్యాన్నిచ్చాయి. ఈ ధైర్యంతో మరిన్ని సినిమాలు కొత్త సంవత్సరంలో రిలీజ్ చేయనున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంది ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ సినిమాల కోసం.

pan indian movies rrr,radhe shyam postpone

భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియన్ స్థాయిలో రిలీజైన ఈ సినిమాలు కొత్త సంవత్సరంలో సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 7న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా 14 భాషలలో రిలీజ్ కానుంది. ఎన్.టి.ఆర్,  రాం చరణ్‌లతో పాటు బాలీవుడ్, హాలీవుడ్ స్టార్ నటిస్తున్నారు. ఇప్పటికే ఊహించని విధంగా అంచనాలు ఏర్పడ్డాయి. రాజమౌళి, హీరోలు, ఇతర చిత్రబృందం భారీ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహిస్తూ సినిమాపై ఇంకా అంచనాలను పెంచుతున్నారు. కొత్త కొత్త పోస్టర్స్ రిలీజ్ చేస్తూ పదే పదే రిలీజ్ తేదీ అదే అంటూ కన్‌ఫర్మ్ చేస్తున్నారు.

RRR – Radhe shyam: ఈ సినిమాల మీద కరోనా థర్డ్ వేవ్ ప్రభావం గట్టిగా పడే అవకాశం..!

ఇక పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ – పూజా హెగ్డే జంటగా యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణ రూపొందించిన రాధే శ్యామ్ జనవరి 14న భారీ స్థాయిలో 7 భాషలలో రిలీజ్ చేస్తున్నారు. దీని ప్రమోషన్స్ కూడా స్కై రేంజ్‌లో నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాల మీద కరోనా థర్డ్ వేవ్ ప్రభావం గట్టిగా పడే అవకాశం ఉందని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. ఇదే జరిగితే మళ్ళీ ఈ సినిమాలు పోస్ట్‌పోన్ అవుతాయని అంటున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల లాక్ డౌన్ పెట్టారు. జనవరికి రెండు రాష్ట్రాలలో ఇప్పుడు థర్డ్ వేవ్ ప్రభావం బాగానే ఉంటుందని వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి ఈ రెండు సినిమాలు అనుకున్న సమయానికి రిలీజ్ చేస్తారా..మళ్ళీ రీ షెడ్యూల్ చేస్తారా.


Share

Recent Posts

Devatha 11August 622: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దేవి.. మా నాన్న ఎవరో చెప్పకపోతే రానన్న దేవి..

దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…

8 mins ago

కొత్త సినిమా నిర్మాతలకు డెడ్ లైన్ పెట్టిన బాలకృష్ణ..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…

10 mins ago

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

2 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

3 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

4 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

6 hours ago