ఒక్క ఫ్లాప్ తో డైలమాలోకి వెళ్లిపోయిన స్టైలిష్ స్టార్

Share

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్… డైలమాలో ఉన్నాడు… భారీ అంచనాల మధ్య వచ్చిన నా పేరు సూర్య సినిమా నిరాశపరచడంతో నెక్స్ట్ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ఆలోచిస్తున్నాడు… ఆ సినిమా రిలీజ్ అయి నాలుగు నెలలు దాటుతున్నా కూడా బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటీ లేదు.

అయితే విక్రమ్ తో అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి కానీ విక్రమ్ సినిమా కొంచెం పక్కన పెట్టాలని, ఫ్లాప్ లో ఉన్న సమయంలో రిస్క్ చేయడం ఎందుకని బన్నీ ఆలోచిస్తున్నట్లున్నాడు. అందుకే తనకి బాగా అచొచ్చిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమా చేయాలని అనుకుంటున్నాడట… వీళ్ల ఇద్దరి కాంబినేషన్ లో గతంలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు వచ్చాయి.. జులాయి సువర్ హిట్ అవగా, సత్యమూర్తి సినిమాకి మంచి పేరొచ్చింది…

ఈ రెండు మూవీస్ బన్నీ కెరీర్ లోనే స్పెషల్ మూవీస్ గా నిలిచే మూవీస్, బాక్సాఫీస్ దగ్గరే కాకుండా నటుడిగా కూడా చాలా మంచి పేరు తెచ్చిపెట్టాయి. యాక్టర్ గా మరో మెట్టు ఎక్కించాయి, మాస్ ని మెప్పిస్తునే, క్లాస్ కి కనెక్ట్ అయ్యేలా ఉండే ఒక మంచి సినిమాని త్రివిక్రమ్ తో బన్నీ ప్లాన్ చేస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో ఎప్పటి నుంచో ఒక వార్త ప్రచారంలో ఉంది కానీ అఫీషియల్ న్యూస్ మాత్రం బయటకి రాలేదు. అయితే ఇప్పుడు త్రివిక్రమ్, విక్రమ్ కుమార్ కాకుండా బన్నీ నెక్స్ట్ సినిమా గురించి మరో డైరెక్టర్ పేరు వినిపిస్తుంది. అతనెవరో కాదు గీత గోవిందం సినిమాతో ఈ ఇయర్ సూపర్ హిట్ అందుకున్న పరశురామ్. మంచి రైటర్ అయిన పరశురామ్, దర్శకుడిగా కూడా మంచి హిట్స్ అందుకున్నాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఇప్పటికే రెండు సినిమాలు చేసిన పరశురామ్ తో మరో మూవీ చేయాలని గీత ఆర్ట్స్ భావిస్తున్నారు. సో వాళ్ల కాంబినేషన్ లో వచ్చే మూడో సినిమాలో బన్నీ హీరోగా ఉంటాడని అందరూ అనుకుంటున్నారు. మరి బన్నీ పరశురామ్ తో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడో లేదో తెలియాలి.


Share

Related posts

Prabhas: ప్రభాస్ పై సంచలన కామెంట్స్ చేసిన బాలీవుడ్ డైరెక్టర్..!!

sekhar

24 ఏళ్ల ‘నిన్నేపెళ్లాడతా’.. కృష్ణవంశీ తెర వెనక కథ ఇదీ..

Muraliak

Bigg boss Avinash : డ్యాన్స్ ప్లస్ షోకు వెళ్లి బిగ్ బాస్ అవినాష్ ఏం చేశాడో చూడండి?

Varun G

Leave a Comment