చాలా రోజుల గ్యాప్ తర్వాత ఆది పినిశెట్టి మళ్లీ తెరపైకి వచ్చారు. హీరోగా, విలన్‌గా మంచి గుర్తింపు ఉన్న ఆది పినిశెట్టికి కోలీవుడ్, టాలీవుడ్‌లో ప్రేక్షకుల ఆదరణ బాగానే ఉంది. టాలీవుడ్‌లో నటించిన చాలా వరకు సినిమాల్లో ఆయన విలన్ పాత్రల్లోనే కనిపించారు. అలాగే తమిళంలో నటించిన చాలా వరకు సినిమాలు టాలీవుడ్‌లో రీమేక్ అయ్యాయి. ఆది పినిశెట్టి, హన్సిక జంటగా నటించిన తాజా చిత్రం ‘పార్ట్‌నర్’. దామోదరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. త్వరలోనే ఓటీటీలో రిలీజ్ కానుంది. అయితే సైంటిఫిక్ కామెడీ కథాంశంతో రూపొంచిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా? సినిమా స్టోరీ ఎలా ఉంది? ఫ్లాపుల్లో ఉన్న ఆది పినిశెట్టి, హన్సికకు హిట్ దక్కిందా? యోగి బాబు కామెడీ ఎలా ఉంది? తదితర విషయాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

సినిమా పేరు: పార్ట్‌నర్
నటీనటులు: ఆది పినిశెట్టి, హన్సిక, యోగిబాబు, రోబో శంకర్, జాన్ విజయ్, ఫలక్ లాల్వానీ, రవి మరియ, ఆర్.పంధిరారాజన్, టైగర్ థంగదురై తదితరులు
డైరెక్టర్: మనోజ్ దామోదరన్
ప్రొడ్యూసర్: ఎంఎస్ లోకనాథన్
సినిమాటోగ్రఫి: షబీర్ అహ్మద్
ఎడిటర్: ప్రదీప్ ఈ రాఘవ్
విడుదల తేదీ: 25 ఆగస్టు 2023

సినిమా స్టోరీ..
శ్రీధర్ (ఆది పినిశెట్టి) వ్యాపారంలో నష్టపోయి అప్పుల్లో కూరుకుపోయి ఉంటాడు. శ్రీధర్‌కు అప్పు ఇచ్చిన ఫైనాన్షియర్ అతడికి వార్నింగ్ ఇస్తాడు. ఎలాగైనా అప్పు తీర్చాలని, లేకుంటే శ్రీధర్ చెల్లిని పెళ్లి చేసుకుంటాడని బెదిరిస్తాడు. దాంతో శ్రీధర్ అప్పు తీర్చేందుకు సిటీకి వెళ్లాడు. సిటీలో సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే శ్రీధర్ స్నేహితుడు కళ్యాణ్ (యోగి బాబు) దగ్గరికి వెళ్తాడు. కళ్యాణ్ టీసీసీఎస్ పేరుతో సాఫ్ట్‌వేర్ కంపెనీ ముసుగులో స్కామ్‌లు, దొంగతనాలు చేస్తుంటాడు. ఇదే విషయాన్ని శ్రీధర్‌కు చెప్తాడు. డబ్బులు పెద్ద మొత్తంలో అవసరం ఉండటంతో శ్రీధర్ కూడా ఒప్పుకుంటాడు. అయితే పెద్ద మొత్తంలో డబ్బులు ఎలా సంపాదించాలని, పెద్ద మొత్తంలో ఏదైనా కాజేయాలని ప్లాన్ చేస్తున్న తరుణంలో వీళ్లకు ఒక డీల్ వస్తుంది.
ఓ సైంటిస్ట్ తయారు చేసిన చిప్‌ను దొంగిలించి జాన్ విజయ్ అనే వ్యక్తికి ఇవ్వడానికి శ్రీధర్ డీల్ కుదుర్చుకుంటాడు. ఆ చిప్‌ను దొంగలించే క్రమంలో సైంటిస్ట్ చేసిన ప్రయోగం వల్ల కళ్యాణ్ అమ్మాయిగా (హన్సిక) మారిపోతాడు. ఆ తర్వాతి నుంచే సినిమా అసలు కథ స్టార్ట్ అవుతుంది. అమ్మాయిగా మారిన కళ్యాణ్ ఎలాంటి ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తాడు? అప్పటికే ప్రేమలో ఉన్న శ్రీధర్‌పై తన ప్రేయసి పల్లక్ లల్వానీ అపార్థం చేసుకోవడం? తన చెల్లిని పైనాన్షియర్ బారి నుంచి ఎలా కాపాడుతాడు? ఆ చిప్ దొరుకుతుందా? జాన్ విజయ్ నుంచి శ్రీధర్, కళ్యాణ్ ఎలా తప్పించుకుంటారు? తదితర ఆసక్తికరమైన అంశాలతో సినిమా స్టోరీ ముందుకు సాగుతుంది.

సినిమా ఎలా ఉంది?
‘పార్ట్‌నర్’ సినిమా సైంటిఫిక్ అంశాలతో ముడిపడిన కామెడీ ఎంటర్‌టైనర్. గతంలో ఈ కాన్సెప్ట్‌పై సినిమాలు చాలానే వచ్చాయి. సినిమా స్టోరీ, కామెడీ పండితే సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. కానీ పార్ట్‌నర్‌లో ఊహించిన స్థాయిలో కామెడీ లేదనే చెప్పవచ్చు. నార్మల్ కామెడీనే కనిపిస్తుంది. చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ అందులోనే కామెడీని చూపిస్తూ ఫస్టాప్ ముందుకు సాగింది. కొన్ని సన్నివేశాలు బాగా లెంథీగా అనిపించాయి. సైంటిస్ట్ నుంచి చిప్ దొంగిలించే క్రమంలో కళ్యాణ్ హన్సికగా మారిపోయే ట్విస్ట్‌తో సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. అయితే హన్సిక ఎంట్రీతో సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. కానీ ట్విస్ట్‌లను సరిగ్గా వాడుకోలేదని చెప్పుకోవచ్చు. యోగిబాబు తన కామెడీ టైమింగ్‌తో ఒకటి, రెండు చోట్లు బాగా నవ్వించాడు. పార్ట్‌నర్ సినిమా బాగున్నప్పటికీ కామెడీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఆది పినిశెట్టి, హన్సిక యాక్టింగ్ బాగుంది. ఓవరాల్‌గా సినిమా బాగుంది.
న్యూస్ ఆర్బిట్ రేటింగ్: 2.5/5
గమనిక: ఈ సమీక్ష సమీక్షుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
Samantha: శాకుంతలం ట్రైలర్ చూసి నాగచైతన్య ఒకేఒక్క మాట అన్నాడు..!?