Balakrishna: బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానుండటం.. బాలయ్య నటిస్తున్న వీరసింహారెడ్డి సెట్స్ కి పవన్ హాజరు కావడం.. ఇలాంటి సర్ప్రైజ్ ల నుంచి ఇద్దరు ఫ్యాన్స్ ఇంకా తేరుకోలేదు.. అయితే ఇంతలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో, ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది..
బాలకృష్ణ వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నట్లు జోరుగా ప్రచారం మొదలయింది.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే.. ఇది జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.. బాలయ్య, పవన్ పబ్లిక్ గా ఒకే వేదిక కనిపిస్తే ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ గ్యారెంటీ.. వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ వేడుక జనవరి 6న నిర్వహించేందుకు సన్నాహలు జరుగుతున్నాయి.. ఇప్పటికే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఒక ప్రత్యేక ప్లేస్ ఫైనల్ చేసినట్లు సమాచారం. వీరసింహారెడ్డి డైరెక్టర్ గోపీచంద్ మలినేని సొంత ఊరు ఒంగోలులో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
పవన్ కళ్యాణ్ ఒంగోలుకి వెళ్లి వీరిసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొంటారట. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. పొలిటికల్ గా కూడా మైలేజ్ పెంచుకునే ప్లాన్ లో భాగమే ఇదంతా అనే ప్రచారం కూడా జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. మొత్తానికి ఈ న్యూస్ మాత్రం ఇరు ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ ఇస్తుంది.