Unstoppable 2: “ఆహా” ఓటిటి ప్లాట్ ఫామ్ లో “అన్ స్టాపబుల్” టాకీ షో మంచి క్రేజ్ సంపాదించుకోవడం తెలిసిందే. బాలకృష్ణ హోస్ట్ గా ఈ షో ద్వారా అభిమానులను మరింతగా అలరిస్తున్నారు. సినిమాలలో కంటే ఈ షో ద్వారా బాలయ్య మంచి క్రేజ్ సంపాదించుకోవడం జరిగింది. సినిమాల పరంగా నందమూరి బ్రాండ్ అదంతా ఒక లెక్క అయితే ఈ షో ద్వారా మిగతా అభిమానులకు కూడా మరింతగా దగ్గరయ్యారు. “ఆహా” ఓటీటీ లలో సక్సెస్ కావడానికి ఈ షో ప్రధాన కారణం అని చెప్పవచ్చు. గత ఏడాది ప్రారంభమైన ఈ షోలో మొదటి సీజన్ లో మొత్తం అందరు సినిమా సెలబ్రిటీలు వచ్చారు. బాలయ్య అదరగొట్టే రీతిలో ప్రశ్నలు వేస్తూ మరోపక్క.. మంచి ఎంటర్టైన్మెంట్ షోకి వచ్చే వారి దగ్గర పండించేవారు.
సెలబ్రిటీల జీవితాలలో కాంట్రవర్సీ ప్రశ్నలతో పాటు.. మరింతగా క్యూరియాసిటీ పెంచే ప్రశ్నలు కూడా బాలయ్య తనదైన శైలిలో అడగటం ఆహా వీక్షకులకు ఎంతగానో ఆకట్టుకుంది. మొదటి సీజన్ ఎంతగానో ఆకట్టుకోవటంతో సెకండ్ సీజన్ మరింత గ్రాండ్ గా ప్రస్తుతం ఆహా టీం రన్ చేస్తున్న సంగతి తెలిసిందే. సెకండ్ సీజన్ లో సెలబ్రిటీలతోపాటు రాజకీయ నాయకులూ కూడా రావటం విశేషం. దీంతో సెకండ్ సీజన్ మొదటి ఎపిసోడ్ నారా చంద్రబాబునాయుడు మరియు నారా లోకేష్ తో స్టార్ట్ చేసి.. కొర్ర హీరోలతో పార్టీ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోలు అయినా ప్రభాస్ వంటి వారిని ఇప్పటిదాకా తీసుకొచ్చారు.
రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కూడా రావటం జరిగింది. డిసెంబర్ నెలలో పవన్ అండ్ స్టాపబుల్ ఎపిసోడ్ షూట్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ తో పాటు డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా వచ్చారు. అయితే పవన్…బాలయ్య “అన్ స్టాపబుల్” ఎపిసోడ్ సంక్రాంతి కానుకగా స్ట్రీమింగ్ అవుతుందని అందరూ భావించారు. కానీ కుదరలేదు. అయితే ఈ ఎపిసోడ్ కి సంబంధించి ఫస్ట్ గ్లింప్స్ వీడియో కొద్దిసేపటి క్రితం విడుదల అయింది. బాలకృష్ణ మరియు పవన్ కళ్యాణ్ షూటింగ్ స్పాట్ కి వచ్చిన విధానం అక్కడి కటౌట్లు, ఫ్యాన్స్ హడావిడితో పాటు… నీ మెజర్మెంట్స్ తీసుకోవాలని బాలకృష్ణ డైలాగ్ వేయటం దానికి పవన్ స్మైల్ ఇవ్వటం చూపించారు. ఈ వీడియోకి మెగా మరియు నందమూరి అభిమానుల నుండి భారీ ఎత్తున రెస్పాన్స్ వస్తుంది.