33.2 C
Hyderabad
March 23, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Ustaad Bhagat Singh: పవన్ హరి శంకర్ “ఉస్తాద్ భగత్ సింగ్” మొదటి షెడ్యూల్ లేటెస్ట్ అప్డేట్..?

Share

Ustaad Bhagat Singh: తెలుగు చలనచిత్ర రంగంలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో “హరిహర వీరమల్లు” సినిమా షూటింగ్ ఇటీవలే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ వేసవిలో సినిమా రిలీజ్ కానుంది. కాగా ఇప్పుడు సముద్రఖని దర్శకత్వంలో “వినోదయ సీతం” రీమేక్ ప్రారంభించడం జరిగింది. ఈ సినిమాలో పవన్ తో పాటు సాయి ధరంతేజ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. కేవలం 30 రోజులు మాత్రమే ఈ సినిమాకి సంబంధించి కాల్ షీట్స్ పవన్ ఇవ్వటం దానికి భారీ ఎత్తున రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది.

Pawan Hari Shankar Ustadh Bhagat Singh First Schedule Latest Update

ఇదిలా ఉంటే హరి శంకర్ దర్శకత్వంలో “ఉస్తాద్ భగత్ సింగ్” అనే ప్రాజెక్టు ప్రకటించడం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలెట్టడానికి పవన్ రెడీ అయిపోయారట. ఏప్రిల్ మొదటి వారంలో షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్లు సమాచారం. మొదటి షెడ్యూల్ లో ఏకధాటిగా పది రోజులపాటు షూటింగ్ జరగనుంది అంట. పవన్ కళ్యాణ్ సరసన శ్రీ లీల హీరోయిన్ అని సమాచారం. హరీష్ సినిమా కోసం పవన్ అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తూ ఉన్నారు. వాస్తవానికి పవన్ తో “భావదీయుడు భగత్ సింగ్” చేస్తున్నట్లు రెండు సంవత్సరాల క్రితం హరీష్ ప్రకటించడం జరిగింది. టైటిల్ తో కూడిన పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కానీ తాజాగా ఇటీవల “ఉస్తాద్ భగత్ సింగ్” చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Pawan Hari Shankar Ustadh Bhagat Singh First Schedule Latest Update

అయితే ఈ సినిమా తమిళ హీరో విజయ్ నటించిన తేరి సినిమాకి రీమేక్ అని… ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా తెలుగులో పోలీసోడు టైటిల్ తో రావడం జరిగింది. దీంతో పవన్ ఫ్యాన్స్ హరీష్ పై అప్పట్లో నెగిటివ్ కామెంట్లు చేయడం కూడా జరిగింది. ఈ విషయంపై హరీష్ సోషల్ మీడియాలో సైతం సీరియస్ అయ్యారు. ఇదిలా ఉంటే హరీష్ దర్శకత్వంలో పవన్ నటించిన “గబ్బర్ సింగ్” ఇండస్ట్రీలో అనేక రికార్డులు అప్పట్లో క్రియేట్ చేయడం జరిగింది. దీంతో హరీష్ దర్శకత్వంలో వస్తున్న ఈ రెండో సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.


Share

Related posts

హీరో రామ్ పోతినేని ఏంటి పెళ్లి గురించి అడిగితే అలా అనేశాడు!!

Naina

Pawan kalyan: పవన్ కోసం మహేష్ బాబు హీరోయిన్ నీ సెట్ చేస్తున్న హరీష్…??

sekhar

Intinti Gruhalakshmi: తులసి విశ్వరూపం చూసిన నందు.. కోడళ్ళ కి క్లాస్.. పూజ చేయడానికి లాస్య ఎలాంటి స్కెచ్ వేసిందంటే..!!

bharani jella