Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడు సంవత్సరాల తర్వాత వకీల్ సాబ్ సినిమా తో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రేపు రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. మొట్ట మొదటి సారి పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో కనిపిస్తున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు ఓ రేంజిలో పెట్టుకున్నారు. బాలీవుడ్ “పింక్” సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన “వకీల్ సాబ్”.. తెలుగు నేటివిటీ కోసం దర్శకుడు వేణు శ్రీరామ్ చాలా చేంజ్ చేయడం జరిగింది.
ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత పవన్ చేయబోయే సినిమాలో డైరెక్టర్ హరీష్ శంకర్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అధికారికంగా కూడా ప్రకటన చేయడం జరిగింది. ఇదిలా ఉంటే హరీష్ శంకర్ పవన్‌తో చేయబోయే రెండో సినిమా టైటిల్ సంచారి అని ఇండస్ట్రీలోనే సరికొత్త టాక్ వినపడుతోంది. చాలా డిఫరెంట్ సబ్జెక్ట్ పవన్ కి హరీష్ సెట్ చేయటం జరిగిందని, కచ్చితంగా పవన్ కెరియర్ లో ఈ సినిమా నిలిచిపోయే విధంగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
గతంలో హరీష్ దర్శకత్వంలో పవన్ నటించిన “గబ్బర్ సింగ్” సూపర్ డూపర్ హిట్ కావడంతో … హరీష్ శంకర్ దర్శకత్వం లో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు పవన్ ఫ్యాన్స్. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్లు అతి తక్కువ టైమ్ లోనే… సినిమాని కంప్లీట్ చేసే తరహాలో పవన్- హరీష్ షెడ్యూల్స్ ప్రిపేర్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.