న్యూస్ సినిమా

Pawan kalyan: భవదీయుడు భగత్‌సింగ్‌ను లైన్‌లో పెడుతున్న పవన్..వీరమల్లు ఆగిపోయిందా..?

Share

Pawan kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీని తర్వాత క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ డ్రామా హరిహర వీరమల్లు చిత్రాన్ని చేయాలి. ఇప్పటికే 60 శాతం టాకీ పార్ట్ పూర్తైంది. ఆ తర్వాత కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయింది. అంతేకాదు జనవరి నుంచి మళ్ళీ షూటింగ్ మొదలుపెట్టేందుకు మేకర్స్ లొకేషన్స్ కూడా ఫైనల్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి తెలిపారు. దర్శకుడు క్రిష్, నిర్మాత ఏ ఎం రత్నం అలాగే సినిమాటోగ్రాఫర్ లొకేషన్స్ చూస్తున్నట్టు ఫొటోలు పెట్టారు.

pawan-is-coming-with-bhavadiyudu-bhagath-singh
pawan-is-coming-with-bhavadiyudu-bhagath-singh

అయితే ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న టాక్ ప్రకారం హరిహర వీరమల్లు చిత్రంషూటింగ్ ఆగిపోయినట్టు తెలుస్తోంది. దీనికి కారణాలు ఏంటో తెలియనప్పటికీ షూటింగ్ మాత్రం ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు లేవంటున్నారు. దాంతో పవన్ ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మొదలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ భవదీయుడు భగత్‌సింగ్ సినిమాను చేయనున్న సంగతి తెలిసిందే. అధికారికంగానూ ఎప్పుడో ఈ సినిమాను ప్రకటించారు.

Pawan kalyan: వీరమల్లు సినిమా పరిస్థితేంటో..?

కానీ, భీమ్లా నాయక్ వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఇప్పుడు వీరమల్లు షూటింగ్ మొదలవకపోవడంతో భవదీయుడు సెట్స్ మీదకు తీసుకురాబోతున్నారట. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా ను భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. దేవీశ్రీప్రసాద్ దీనికి సంగీత దర్శకుడు. ఇక తాజాగా ఈ సినిమాలో మక్కల్ సెల్వం విజయ్ సేతుపతి పవన్‌కు విలన్‌గా నటించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. పవర్ ఫుల్ విలన్ పాత్రకు విజయ్‌ను మేకర్స్ ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందట. మరి వీరమల్లు సినిమా పరిస్థితేంటో చూడాలి.


Share

Related posts

Prabhas Donation: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ది దొడ్డ మనసు..! ఏపి వరద బాధితులకు భారీ విరాళం..!!

somaraju sharma

బిగ్ బాస్ 4: ఉన్న కొద్దీ ఆ టాప్ కంటెస్టెంట్ గ్రాఫ్ కిందకి…??

sekhar

సర్వ రోగ నివారిణి అయిన అమృత ఫలం ఇదే!!

Kumar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar