NewsOrbit
Entertainment News సినిమా

Pawan Kalyan: ముచ్చటగా మూడోసారి పవన్ కళ్యాణ్ తో త్రిష…?

Share

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రజెంట్ పవన్ చేస్తున్న సినిమాల షూటింగ్స్ మరే హీరో చేయటం లేదు. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, హరిష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, సుజిత్ దర్శకత్వంలో OG, సముద్రఖని దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ తో మల్టీస్టారర్ సినిమాలు చేస్తున్నారు. ఈ నాలుగు సినిమా షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. వీటిలో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు… సినిమా షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. కొద్దిపాటి బ్యాలెన్స్ వర్క్ మాత్రమే మిగిలి ఉంది. మొగలుల సామ్రాజ్యం కాలం నాటి వాస్తవమైన స్టోరీతో… పిరియాడికల్ జోనర్ తరహాలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.

trisha playing guest roll in pawan kalyan hari hara veera mallu

పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో గజదొంగ పాత్రలో నటించినట్లు సమాచారం. నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో హీరోయిన్ త్రిష చేత నటింప చేయించడానికి మేకర్స్ రెడీ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఇండస్ట్రీ నుండి వస్తున్న అప్‌డేట్ ప్రకారం ఈ మూవీకి అదనపు గ్లామర్ యాడ్ చేయడానికి సీనియర్ హీరోయిన్ త్రిషను తీసుకునేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని టాక్. రీసెంట్‌గా ‘పొన్నియిన్ సెల్వన్’ తర్వాత త్రిష ఇమేజ్ బాగా పెరగ్గా.. ఆ ఇమేజ్‌ని ‘హరి హర వీరమల్లు’కి క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారని సమాచారం. గతంలో పవన్ కళ్యాణ్ తో త్రిష రెండు సినిమాలు చేయటం జరిగింది. బంగారం, తీన్ మార్ సినిమాలు చేయటం జరిగింది.

trisha playing guest roll in pawan kalyan hari hara veera mallu

ఈ రెండు సినిమాలు కూడా అట్టర్ ప్లాప్ అయ్యాయి. అయితే ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పవన్ కళ్యాణ్ తో.. క్రిష్ దర్శకత్వంలో పీరియాడిక్‌ యాక్షన్ అడ్వేంచర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో… త్రిష చేత స్పెషల్ రోల్ చేయించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘హరి హర వీరమల్లు’ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది. మధ్యలో మహమ్మారి రావటంతో సినిమా షూటింగ్స్ వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈసారి షూటింగ్ మొత్తం కంప్లీట్ కానున్నట్లు సమాచారం. ఏది ఏమైనా 2024 ఎన్నికలకు ముందు గానే ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలు మొత్తం కంప్లీట్ చేసే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారంట. ఈ క్రమంలో “హరిహర వీరమల్లు” బ్యాలెన్స్ షూటింగ్ ఫినిషింగ్ టచ్ ఇవ్వడానికి పవన్ రెడీ అయినట్లు టాక్.


Share

Related posts

ఒరిజినల్ కథ లో ఇలాంటి మార్పు చేస్తే సినిమా హిట్ అవుతుందా ..పవన్ నమ్మకంగా ఒప్పుకున్నాడు ..?

GRK

క‌లిసొచ్చిన సండే.. 3వ రోజు బాక్సాఫీస్ వ‌ద్ద `సీతా రామం` బీభ‌త్సం!

kavya N

Pawan-Charan: ఒకే రోజు బాబాయ్‌, అబ్బాయ్‌ సినిమాలు.. ఇక మెగా ఫ్యాన్స్‌కు పండ‌గే!

kavya N