Unstoppable 2: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “అన్ స్టాపబుల్” మొదటి ఎపిసోడ్ అనేక రికార్డులు క్రియేట్ చేయడం తెలిసిందే. “ఆహా”లో ప్రభాస్ ఇంకా మహేష్ క్రియేట్ చేసిన రికార్డులను పవన్ ఎపిసోడ్ బ్రేక్ చేయడం జరిగింది. మొదటి ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత మరియు సినిమాకి సంబంధించి ఇంకా కుటుంబానికి సంబంధించిన ప్రశ్నలు బాలయ్య వేయడం తెలిసిందే. ఈ క్రమంలో డైరెక్టర్ త్రివిక్రమ్ తో స్నేహం గురించి ఇంకా తన మూడు పెళ్లిళ్ల గురించి పవన్ చెప్పిన సమాధానాలు చాలా హైలైట్ అయ్యాయి. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 10వ తారీకు పవన్ “అన్ స్టాపబుల్” సెకండ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతున్నట్లు ఆహా టీం ప్రోమో రిలీజ్ చేసింది.

సూటి ప్రశ్నలు.. తూట లాంటి సమాధానాలతో.. పార్ట్ 2 ఫిబ్రవరి 10వ తారీకు రెడీ అయినట్లు మరింత సెన్సేషన్ క్రియేట్ చేయనున్నట్లు స్పష్టం చేయడం జరిగింది. అయితే పవన్ “అన్ స్టాపబుల్” సెకండ్ ఎపిసోడ్ ప్రోమోలో చాలా వరకు రాజకీయ నేపథ్యానికి సంబంధించిన ప్రశ్నలు బాలయ్య వేశారు. “జనసేన” పార్టీ ఆవిర్భావం గురించి ఇంకా 2019 ఎన్నికల సమయంలో పార్టీకి ఓట్లు పడకపోవడంపై ప్రశ్నించారు. ఇంకా 2019 ఎన్నికల మేనిఫెస్టో జనంలోకి వెళ్లక పోవటం వల్లే.. ఓట్లు రాలేదేమో అన్న సందేహాన్ని కూడా బాలయ్య వ్యక్తం చేశారు. ఇక ఇదే సందర్భంలో తెలుగుదేశం పార్టీతో కలిసి జనసేన పని చేస్తున్న తరహాలో కూడా పవన్ ని ప్రశ్నించడం జరిగింది. అయితే ఈ ప్రోమోలో చాలావరకు వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని మరి ముఖ్యంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆధిపత్య ధోరణి వ్యవహరిస్తున్నట్లు పవన్ సమాధానాలు ఉన్నాయి.

ఇప్పటం గ్రామంలో ఇల్లు కూల్చి వేసిన సమయంలో పవన్ కారుపై కూర్చుని నడిరోడ్డుపై బయలుదేరిన ఫోటో కూడా వేసి బాలయ్య తనదైన శైలిలో ప్రశ్నించారు. దానికి పవన్ స్పందించి కారులో కూర్చోకూడదు రూమ్ లో నుంచి బయటకు రాకూడదనేసరికి చాలాకాలం తర్వాత తిక్క బయటకు వచ్చింది.. అని సమాధానం ఇచ్చారు. కాగా సరిగ్గా ప్రోమో మధ్యలో డైరెక్టర్ క్రిష్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బాలయ్య మా ఇద్దరితో కలిసి నువ్వు పని చేశావు. ఇద్దరికీ మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి అని ప్రశ్నించారు. ఒక సింహం ఒక పులి మధ్య లో నా తల ఉన్నట్టు… అనిపించింది అని క్రిష్ సమాధానమిచ్చారు. ఇంకా పూర్తిగా రాజకీయానికి పరిమితం అవ్వాల్సి వస్తే అన్న ప్రశ్న బాలయ్య వెయ్యగా పవన్ కళ్యాణ్.. ఏదో రాస్తున్నట్టు ప్రోమోలో చూపించి.. సస్పెన్స్ లో పెట్టడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే పవన్ “అన్ స్టాపబుల్” సెకండ్ ఎపిసోడ్ చాలా వరకు రాజకీయవేడిని రాజేస్తున్నట్లు తెలుస్తోంది.