Pawan Kalyan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇండస్ట్రీలో చాలా ఫ్రెండ్లీ వాతావరణం దిశగా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటి లో అల్లు అర్జున్ తో ఎవడు, ఎన్టీఆర్ తో RRR… ఆ తర్వాత చిరంజీవితో కలిసి సినిమాలు చేసిన చరణ్ తాజాగా పవన్ కళ్యాణ్ తో కూడా ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మేటర్ ఏమిటంటే రామ్ చరణ్ తన కెరీర్లో పదిహేనవ సినిమా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఐఏఎస్ పాత్ర రామ్ చరణ్ చేస్తున్నట్టు చివరాకరికి ముఖ్యమంత్రిగా కూడా చరణ్ కనిపించనున్నట్లు ఇప్పటికే వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. హిందీలో కీలకమైన పాత్రలో.. సల్మాన్ ఖాన్, కన్నడలో.. సుదీప్, తమిళంలో విజయ్ సేతుపతి నటిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో తెలుగులో ఆ పాత్రకి పవన్ కళ్యాణ్ ని తీసుకోవడానికి శంకర్.. చరణ్ కి ఐడియా ఇచ్చినట్లు టాక్. పైగా ఈ సినిమా నిర్మాత దిల్ రాజు నిర్వహిస్తున్న నేపథ్యంలో శంకర్ ఐడియా కి దిల్ రాజు కూడా ఓకే అయినట్లు చరణ్ తో డిస్కస్ చేసినట్లు.. త్వరలోనే పవన్ పాత్రకి సంబంధించి క్లారిటీ రానున్నట్లు టాక్. ఒకవేళ పవన్ కళ్యాణ్ నటించకపోతే ఆ పాత్రలో రామ్ చరణ్ .. పెద్ద తరహా పాత్ర వేసేలా శంకర్ ఆలోచన చేస్తున్నారట.
భారీ బడ్జెట్ తరహాలో తెరకెక్కుతున్న ఈ సినిమా.. షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుందట. ప్రస్తుతం చరణ్ రాజమౌళి దర్శకత్వంలో RRR, కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలకు సంబంధించిన షూటింగులు చాలావరకు క్లైమాక్స్ కి చేరుకున్నాయి. దీంతో ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం శంకర్ సినిమా పై పెట్టినట్లు సమాచారం. దీంతో బాబాయ్ పవన్ తో.. ఈ స్క్రిప్ట్ గురించి చరణ్ త్వరలోనే డిస్కస్ చేయనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. నిజంగా ఈ సినిమాలో చరణ్ తో పాటు పవన్ నటిస్తే మాత్రం మెగా అభిమానులకు పూనకాలే అని సిని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.